మీడియాపై దాడి... పవన్ పై కత్తి ఫైర్

Thu Feb 22 2018 20:43:18 GMT+0530 (IST)

జనసేన పార్టీ అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్‌ను మరోమారు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు కెలికారు. ఓ మీడియా సంస్థకు చెందిన ఉద్యోగిపై జరిగిన దాడిని పవన్ ఖండిస్తే...దానిపై కత్తి పంచ్ పేల్చారు. ఓ న్యూస్ చానల్  ఆధ్వర్యంలో గత కొన్ని రోజులగా రాష్ట్రవ్యాప్తంగా  'ఢిల్లీ తో ఢీ ఆంధ్రా రెడీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది..ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజల మనోభావాలను తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆ సంస్థ సీఈఓ బుధవారం రాత్రి విజయనగరం చేరుకున్నారు. అయితే ఈ సమయంలో కొందరు దుండగులు..ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు.  ఈ రాళ్ళ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న కారుతో పాటు..లైవ్ ప్రసారం చేసే DSNG వాహనంపై కూడా దాడి చేసారు. అయితే ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనేది తెలియరాలేదు.ఈ ఘటనపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. దీనిపై పవన్ రియాక్టయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేస్తూ సదరు న్యూస్ చానల్‌పై దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సీఈఓ సహా సిబ్బందిపై దాడి చేయడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుందని అన్నారు. ఇటువంటి దాడులు అప్రజాస్వామికం అని ఇటువంటి ఘటనలు జరగడం మంచిది కాదని మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోందని అన్నారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.

అయితే దీనిపై కత్తి స్పందించారు. `నటుడు శివాజీ మీద దాడిని ఖండించావు. మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఖండించావు. అప్రజాస్వామికం అన్నావు. బాగుంది. పవన్ కళ్యాణ్ కి నా అభినందనలు. మరి నా మీద నీ అభిమానులు దాడిచేస్తే మాత్రం నీలో స్పందన ఉండదా! నోరు పడిపోతుందా! మనసు రాదా!` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు సదరు టీవీ చానెల్ చర్చలో పాల్గొన్న మహేష్...ఈ దాడి వెనుక అధికార పక్షం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.