Begin typing your search above and press return to search.

పరిపూర్ణానంద స్వామికి కత్తి మహేష్ బాస‌ట‌!

By:  Tupaki Desk   |   11 July 2018 1:01 PM GMT
పరిపూర్ణానంద స్వామికి కత్తి మహేష్ బాస‌ట‌!
X
హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ను హైద‌రాబాద్ నుంచి 6 నెల‌ల పాటు బ‌హిష్క‌రించిన విష‌యం విదిత‌మే. అయితే, అనూహ్యంగా ఈ రోజు తెల్ల‌వారుఝామున శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా తెలంగాణ ప్ర‌భుత్వం న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించ‌డం సంచ‌ల‌నం రేపింది. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య పరిపూర్ణానంద స్వామిని కాకినాడుకు త‌ర‌లించిన‌ట్లు పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది వివిధ సంద‌ర్భాల్లో పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్య‌లకు గానూ ఆయ‌న‌ను బ‌హిష్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌రిపూర్ణానంద బ‌హిష్క‌ర‌ణ‌ను ప‌లువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే, అనూహ్యంగా పరిపూర్ణానంద స్వామి న‌గ‌ర బహిష్క‌ర‌ణ‌ను క‌త్తి మ‌హేష్ ఖండించారు.

ఏ సమస్యకైనా బహిష్కరణలు పరిష్కారం కాదని - ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి బహిష్కరణ విరుద్ధమని కత్తి మహేష్ అన్నారు. ఈ ప్ర‌కారం త‌న ఫేస్ బుక్ ఖాతాలో క‌త్తి మ‌హేష్ ఓ పోస్ట్ చేశారు.మనుషుల్ని ‘తప్పిస్తే’ సమస్యలు తప్పుతాయనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుందని కత్తి మహేష్ అన్నారు. అయితే, ప‌రిపూర్ణానంద స్వామికి మ‌ద్ద‌తుగా ప‌లువురు హిందూ సంఘాల నేత‌లు - ప్ర‌ముఖులు మాట్లాడ‌డంలో వింత‌మీ లేదు. కానీ, ఆల్రెడీ బహిష్కరణ వేటు ఎదుర్కొంటోన్న మ‌హేష్ .....పరిపూర్ణానంద స్వామికి మద్దతుగా మాట్లాడడం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే, త‌న‌కు చ‌ట్టంపై గౌర‌వం ఉంద‌ని...అందుకే బ‌హిష్క‌ర‌ణ‌ను ప్ర‌శ్నించ‌డం లేద‌ని మ‌హేష్ త‌న ఫేస్ బుక్ ఖాతాలో అంత‌కు ముందు మ‌రో పోస్ట్ పెట్టారు. విచారణ లేకుండా శిక్ష వేసినా.... సమన్యాయం లేకుండా అన్యాయం చేసినా..... ఇంకా వ్యవస్థలపై నాకు నమ్మకం ఉందని.... ఎంత అన్యాయం జరిగినా న్యాయంగా పోరాడటమే త‌న‌ పంథా అని మ‌హేష్ అన్నారు. ఏది ఏమైనా.... పరిపూర్ణానంద స్వామి బహిష్కరణను ఖండిస్తూ కత్తి మ‌హేష్ చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.