Begin typing your search above and press return to search.

షాక్: భార‌త్ లో పాక్ జెండా ఎగిరింది

By:  Tupaki Desk   |   24 March 2018 8:26 AM GMT
షాక్: భార‌త్ లో పాక్ జెండా ఎగిరింది
X
ప్ర‌పంచంలో మ‌రే దేశంలోనూ ఇలాంటివి జ‌ర‌గ‌వేమో? ప‌్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లే ఒక దేశంలో.. మ‌రో దేశం జెండా.. అందునా దాయాదిగా ఉంటూ దేశంలో క‌ల్లోలం రేపేందుకు ట్రై చేసే దేశ‌పు జెండా ఎగిరేలా చేయ‌టానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఒక‌వేళ‌.. అలాంటి దుస్సాహ‌సానికి ప్ర‌య‌త్నిస్తే.. చ‌ట్టం వారినేం చేయాలో అది చేస్తుంది.

దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. భార‌త్ లో బ‌రితెగింపులు చేసినా కొన్నిసార్లు పెద్ద‌గా ప‌ట్ట‌దు. చాలా సంద‌ర్భాల్లో త‌న ప‌ని తాను చేసుకుపోయే చ‌ట్టం సైతం.. ప్రేక్ష‌కపాత్ర పోషిస్తున్న‌ట్లుగా ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

క‌శ్మీర్లో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాక్ దినోత్స‌వ‌మైన మార్చి 23ను పుర‌స్క‌రించుకొని క‌శ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రాబీ శ్రీ‌న‌గ‌ర్ లో స‌భ‌ను ఏర్పాటు చేశాడు. పాక్ జాతీయ గీతాన్ని ఆల‌పించాడు. అనంత‌రం ఆ దేశ జాతీయ ప‌తాకాన్ని ఎగురువేశారు. దుఖ్తారాన్ - ఏ- మిలాత్ సంస్థ అధ్య‌క్షురాలు ఆసియా ఆంద్రాబీ ఈ స‌భ‌ను నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసేందుకు వెనుకాడ‌లేదు.

భార‌త ఉప‌ఖండంలో ఉన్న వారంతా పాకిస్తానీయులేన‌ని నోరు పారేసుకుంది. 1987లో ప్రారంభ‌మైన ఈ క‌శ్మీరీ వేర్పాటు సంస్థ.. ఆ రాష్ట్రంలో ఇస్లామిక్ లా అమ‌లు చేయాల‌ని పోరాడుతోంది. ఇస్లామిక్ ఫెమినిస్ట్ గా అభివ‌ర్ణించే ఈమె సంస్థ‌ను ఉగ్ర‌వాద ప్రేరేపిత సంస్థ‌గా భార‌త ప్ర‌భుత్వం గుర్తించింది.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత తీరిగ్గా పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీనిపై క‌శ్మీర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎలాంటి వ్యాఖ్య చేయ‌లేదు. ఈ సంస్థ ఇదే రీతిలో గ‌తంలోనూ వ్య‌వ‌హ‌రించింది. కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన వేళ‌లోనే రియాక్ట్ అయి.. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించినా.. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయినా ఇలాంటి బ‌రితెగింపు చ‌ర్య‌లు చోటు చేసుకునేవి కాదేమో?