Begin typing your search above and press return to search.

నీటి యుద్ధాల్లో కర్ణాటక కొత్త బేరం

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:47 AM GMT
నీటి యుద్ధాల్లో కర్ణాటక కొత్త బేరం
X
రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నదీజలాల పంపకంపై వివాదాలు నడుస్తూనే ఉంటున్నాయి. ముఖ్యంగా నీటి కొరత ఉన్నప్పుడు ఎగువ నుంచి విడుదల చేయకపోవడంతో వివాదాలు తలెత్తుతూ కోర్టుల్లో కేసు నడుస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంపైనా వివాదాలున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై వివాదం ఉన్నట్లే తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి వివాదం కూడా కొద్ది రోజులుగా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో సుప్రీం ఆదేశాలను కూడా కర్ణాటక కాదంటున్న పరిస్థితి. ఇంతవరకు ఒకెత్తయితే... తాజాగా కర్ణాటక చేసిన ప్రతిపాదన జలవివాదాలనే కొత్త మలుపు తిప్పేలా ఉంది. సుప్రీం చెబుతున్నట్లుగా ఇప్పుడు తాము నీరివ్వలేమని.. కావాలంటే బాకీ కింద రాసుకుంటే తమ వద్ద నీరు పుష్కలంగా ఉన్నప్పుడు ఇస్తామని అధిక తెలివితేటలు చూపిస్తోంది.

కావేరి జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక మరోసారి సుప్రీంలో పిటిషన్ వేసింది. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 7 రోజులు తమిళనాడుకు నీరు వదలాలని సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. కావాలంటే అంత నీటిని బాకీ కింద రాసుకోవాలని.. డిసెంబరులోగా ఎప్పుడైనా విడుదల చేస్తామని చెప్పింది.

నిజానికి రానున్నదంతా వర్షాకాలం. కర్ణాటక చెబుతున్నట్లు డిసెంబరులోగా వదిలే అవకాశం ఇవ్వడమంటే వరద జలాలను కిందకు వదలడమే. మరి కర్ణాటక చూపిస్తున్న ఈ అతి తెలివిపై సుప్రీం ఏమంటుందో చూడాలి.