Begin typing your search above and press return to search.

క‌న్న‌డ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు..అమిత్ షా స్కెచ్చేంటో

By:  Tupaki Desk   |   21 May 2018 6:00 PM GMT
క‌న్న‌డ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు..అమిత్ షా స్కెచ్చేంటో
X
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. హోరోహోరీగా సాగిన క‌న్నడ పోరు, సీఎం పీఠం అధిష్టించేందుకు ఇటు బీజేపీ అటు జేడీఎస్‌-కాంగ్రెస్ చేసిన ప్ర‌య‌త్నాలు వెర‌సి య‌డ్యుర‌ప్ప సీఎం పీఠం దిగిపోవ‌డం - కుమార‌స్వామి త్వ‌ర‌లో ప‌ట్టాభిషేకం కానుండ‌టం తెలిసిన సంగ‌తే. అయితే ఈ వ్యూహ‌ ప్ర‌తివ్యూహాల ప‌ర్వం ముగిసిన త‌ర్వాత తాజాగా మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు రానున్నాయ‌నే భావ‌న‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

జేడీఎస్‌-కాంగ్రెస్ నేత‌ల సంబ‌రాల‌పై అమిత్ షా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. `మీ ముఖ్యమంత్రి ఒక స్థానంలో ఓడిపోయారు. సగం మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అటు జేడీఎస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటోంది?. 37 స్థానాలు గెలిచినందుకా?`` అని అమిత్ షా ఎద్దేవా చేశారు. అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నించామని ఆయన స్పష్టంచేశారు. ``ప్రభుత్వ ఏర్పాటుకు బలం లేకపోయినా ముందుకెలా వచ్చారుఅని చాలామంది అడుగుతున్నారు...నిజమే, మరి ఏ పార్టీకి బలం రాలేదు కాబట్టి కర్ణాటకలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అలా చేస్తే ప్రజా తీర్పును గౌరవించినట్లవుతుందా?`` అని అమిత్ షా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

త‌మ‌పై కామెంట్లు చేసే వారికి షా ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. ``హార్స్ ట్రేడింగ్ చేశారని మాపై ఆరోపణలు చేశారు. మరి కాంగ్రెస్ చేసింది ఏమిటి? వాళ్లు మొత్తానికే అమ్ముకున్నారు. ప్రజల తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్ చేతులు కలిపాయని, వాళ్లది ముమ్మాటికీ అపవిత్ర బంధమే`` అని అమిత్ షా స్పష్టం చేశారు. `ఇప్పుడు ప్రతిపక్షాలకు ఈవీఎంలపై నమ్మకం కుదిరింది. ఎన్నికల సంఘంపై నమ్మకం కుదిరింది. అసంపూర్తి విజయం చేతుల్లో ఉన్నా వాళ్లకు ఈవీఎంలు, ఎన్నికల సంఘం నచ్చింది. ఓడిపోయినప్పుడు కూడా ఇలాగే ఉండాలని, సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టబడి ఉండాలని కోరుకుంటున్నా`` అని అమిత్ షా అన్నారు. గవర్నర్‌ ను యడ్యూరప్ప ఏడు రోజుల సమయం కోరినట్లు కాంగ్రెస్ ప్రచారం చేయడం సరి కాదని - కావాలంటే ఆయన గవర్నర్‌కు ఇచ్చిన లేఖను అడగాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రాజ‌కీయాల ప‌రంగా ఎలా ఉన్నా అమిత్‌ షా కామెంట్ల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌పై బీజేపీ తిరిగి ఏదైనా ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టిందా అనే సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతుండ‌టం కొస‌మెరుపు.