Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌కు ఎందుకంత ముఖ్యం?

By:  Tupaki Desk   |   16 May 2018 4:24 AM GMT
క‌ర్ణాట‌క కాంగ్రెస్‌కు ఎందుకంత ముఖ్యం?
X
దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పోగొట్టుకుంది. అయినా పెద్ద‌గా ఫీలైన‌ట్లు క‌నిపించ‌లేదు. చివ‌ర‌కు కాస్త చ‌క్రం తిప్పితే అధికారాన్ని చేజిక్కించుకునే అవ‌కాశం ఉన్న గోవా.. మ‌ణిపూర్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ చురుగ్గా స్పందించింది లేదు. ఒక‌వేళ‌.. వారిప్పుడు క‌ర్ణాట‌క విష‌యంలో అనుస‌రిస్తున్న మెరుపు వేగంలో స‌గం ప్ర‌ద‌ర్శించినా ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక‌టి ఈ రోజు కాంగ్రెస్ ఖాతాలో ఉండేది.

మ‌రిన్ని రాష్ట్రాల్లో ప‌వ‌ర్ పోయినా పాకులాడిన‌ట్లు క‌నిపించ‌ని కాంగ్రెస్‌.. క‌ర్ణాట‌క విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉంది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ పోరాడేందుకు సిద్ధ‌మైన కాంగ్రెస్ వైఖ‌రి ప‌లువురిలో ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. క‌ర్ణాట‌క చేజారితే కాంగ్రెస్ కు జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొండంత అండ‌గా ఉంటుంద‌ని భావించిన క‌ర్ణాటక చేజార‌టంతో దాని ప్ర‌భావం తెలంగాణ రాష్ట్ర ఫ‌లితం మీద‌న ఉండే వీలుంది.

ఆర్థికంగా బ‌ల‌మైన మూలాలు ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రంలో అధికార పార్టీకి జ‌రిగే లాభాలు చాలానే ఉంటాయి. ఎన్నిక‌ల్లో అయ్యే ఖ‌ర్చును అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి బ‌దిలీ చేయ‌టం అనాదిగా వ‌స్తున్న‌దే. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. ఆర్థిక‌ప‌ర‌మైన భ‌రోసా చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల‌కు అందే వీలుంది. అదే చేజారితే.. కాంగ్రెస్ కు మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు. ఒక‌ప్పుడు దేశంలో ఏ మూల‌న చూసినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలుక‌నిపించేవి.

ఈ కార‌ణంతోనే ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. పార్టీకి పెద్ద ఇబ్బందిగా ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఆ పార్టీ ప‌వ‌ర్లో ఉన్న పెద్ద రాష్ట్రం.. ఆర్థిక మూలాలు బ‌లంగా ఉన్న రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో ప‌వ‌ర్ కోల్పోతే కాంగ్రెస్ కు ఆర్థికంగా జ‌రిగే న‌ష్ట‌మ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు