Begin typing your search above and press return to search.

కోటి మంది కి చేరిన కంటివెలుగు

By:  Tupaki Desk   |   6 Dec 2018 9:48 AM GMT
కోటి మంది కి చేరిన కంటివెలుగు
X
అంధత్వ నివారణే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. పథకం ప్రారంభమై 68 రోజులైనా పథకాని కి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు నేత్ర శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అత్యాధునిక యంత్రాల ద్వారా కంటి సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి చికిత్సలు అందిస్తున్న వైద్యులు... అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులతో పాటు శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు ద్వారా 68 రోజుల్లో 1 కోటి 2 వేల 544 మంది నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వారి లో 16 లక్షల 66 వేల 171 మందికి ఉచితం గా కండ్లద్దాలను అందజేశారు. మరో 12 లక్షల 95 వేల 529 మందికి ప్రిస్క్రిప్షన్ ప్రకారం కళ్లద్దాలు తయారు చేయించి ఇస్తారు. కంటి సమస్యల తీవ్రత ఎక్కువగా ఉన్న 6 లక్షల 72 వేల 112 మందిని ఫాలో అప్ చికిత్సల కోసం రిఫర్ చేశారు.

68వ రోజు కంటి వెలుగు శిబిరాల్లో 1 లక్షా 52 వేల 472 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 8 వేల 328 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. దృష్టి లోపాలున్న మరో 5 వేల 234 మందికి ప్రిస్క్రిప్షన్ ప్రకారం కండ్లద్దాలు తయారు చేయించి ఇస్తారు. 4 వేల 60 మంది లో క్యాటరాక్ట్ సమస్య ఉన్నట్టు వైద్యలు గుర్తించారు.

ఎంతో కాలంగా కంటి సమస్యలతో బాధపడుతున్న తమ కు ఈ కార్యక్రమం వల్ల ఉచితం గా వైద్యం చేయించుకునే అవకాశం లభించిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.