Begin typing your search above and press return to search.

దేశంలో కేర‌ళ‌కు మాత్ర‌మే ఉన్న రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   9 Dec 2018 12:18 PM GMT
దేశంలో కేర‌ళ‌కు మాత్ర‌మే ఉన్న రికార్డ్ ఇది
X
కేర‌ళ‌... ఇటీవలే రాష్ట్ర చ‌రిత్ర‌లో ఏనాడు లేనంత స్థాయిలో వ‌ర‌ద‌ల బారిన ప‌డి అత‌లాకుత‌లం అయిన రాష్ట్రం. వ‌ర‌ద‌ల కార‌ణంగా అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకొన్న ఈ రాష్ట్రం మ‌రోమారు దేశం చూపును త‌న పైన ప‌డే రికార్డును న‌మోదు చేసుకుంది.దేశంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు - కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ ను ప్రారంభించారు. సుమారు 2వేల ఎకరాల్లో ఎయిర్ విస్తరించి ఉండగా దీని నిర్మాణం కోసం రూ.1800కోట్లు ఖర్చు చేశారు.

విమానాశ్రయాల అభివృద్ధిలో కేరళ రాష్ట్రం మిగతా రాష్ర్టాల కన్నా ముందంజలో ఉంది. కేరళలో ఇప్పటికే తిరువనంతపురం - కోచి - కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ లు ఉన్నాయి. తాజాగా క‌న్నూర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభ‌మైంది. కన్నూర్ విమానాశ్రయం ఏకకాలంలో 2వేల మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రతిఏడాది 1.5మిలియన్ మంది విదేశీ ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నారు. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టు లిమిటెడ్ ఈ కొత్త ఎయిర్‌ పోర్టును నిర్వహించనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉండ‌టం కొస‌మెరుపు!