Begin typing your search above and press return to search.

మోడీని క‌న్నా అడిగిన మొద‌టి ప్ర‌శ్న ఇదే

By:  Tupaki Desk   |   14 Jun 2018 4:54 AM GMT
మోడీని క‌న్నా అడిగిన మొద‌టి ప్ర‌శ్న ఇదే
X
ఔను. మీరు స‌రిగ్గానే చ‌దివారు. త‌మ పార్టీ నాయ‌కుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని, పార్టీ పెద్ద‌ల‌ను....ఇటీవ‌లే బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌ప్పుప‌ట్టారు. అంతేకాకుండా స‌హ‌జంగా టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అంటే ఇంతెత్తున ఎగిరిప‌డే క‌న్నా ఆయ‌న‌కు అనూహ్యంగా మ‌ద్ద‌తిచ్చే వ్యాఖ్య‌లు చేశారు. ఇంతేకాకుండా...ఈ రెండు ఏకకాలంలోనే జ‌రిగిన‌వి అంటే మీరు మ‌రింత ఆశ్చ‌ర్య‌పోతారు. కానీ నిజం. ఎందుకు ఇలా మాట్లాడారంటే...ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో భేటీ అనంత‌రం క‌న్నా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశం గురించి తెలుసుకోవాల్సిందే.

ఢిల్లీలో తాజాగా విలేక‌రుల స‌మావేశంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ మీడియాతో మాట్లాడుతూ 2014 విభజన చ‌ట్టం ప్రకారం హామీ ఇచ్చిన‌వి, ఇవ్వ‌నివి అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆడిగినివి అన్ని ఇస్తున్నప్ప‌టికీ చంద్రబాబు దుష్ర్ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపన అప్పుడు ప్రధానమంత్రిని రాష్టానికి చాలా చేస్తున్నారు, మీరు కార్య‌క్ర‌మానికి రావాలని చంద్రబాబు అడగ‌గా..ఆయ‌న ఓకే చెప్పార‌ని గుర్తుచేశారు. అయితే, ప్రధానమంత్రి వ‌చ్చి నీరు మట్టి ఇచ్చార‌ని చంద్రబాబు ప్రచారం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మనస్సులో విషబీజం నాటుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస‌మ‌ర్థ‌త‌ అవినీతి వల్లే ఇలా జరుగుతుంది అని అమిత్ షా కు చెప్పామన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో త‌న మొద‌టి భేటీలోనే ఆశ్చ‌ర్య‌పోయే ప్ర‌శ్న వేశార‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయణ వివ‌రించారు. `చంద్రబాబు అసలు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు?` అని మోడీ అడిగారని క‌న్నా తెలిపారు. ``చంద్రబాబు సహజం గుణం నమ్మిని వారుని వెన్నుపోటు పొడుస్తారు. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మే అలా మొద‌లైంది, అలాగే సాగుతోంది. 2014లో ఆయ‌న్ను న‌మ్మి పొత్తు పెట్టుకోవ‌డ‌మే త‌ప్పు, మోసపోవ‌డానికి బీజం. త‌ప్పు చంద్ర‌బాబుది కాదు...న‌మ్మిన‌వాళ్ల‌ను మోసం చేస్తాడ‌ని ఆయ‌న గురించి తెలిసిన‌ప్ప‌టికీ..పొత్తుపెట్టుకున్నందుకు మ‌నదే అని స్ప‌ష్టంగా చెప్పాను`` అంటూ కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం పంచుకున్నారు. ప్ర‌ధానితో భేటీలో అనేక అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చాయని ఆయ‌న పేర్కొన్నారు. రైల్వే జోన్ - స్టీల్ ప్లాంట్ - లాంటి అన్ని అంశాలు చర్చకు వచ్చాయన్నారు.