మోడీ మోసంపై హీరోయిన్ల ఆవేదన

Wed Feb 21 2018 17:20:32 GMT+0530 (IST)

నీరవ్ మోడీ తన రెమ్యూనరేషన్ ఎగ్గొట్టాడంటూ కొంతమంది హీరోయిన్లు వాపోతున్నారు. రూ. 17వేల 500కోట్లు అప్పనంగా దొబ్బితిని తీరా కట్టమంటుంటే పీఎన్బీ బ్యాంకు పైనే కౌంటర్ అటాక్ చేస్తున్నాడు నీరవ్ మోడీ. అంతేకాదు మీ వైఖరి వల్లే నేను డబ్బుకట్టలేకపోతున్నానంటూ లేఖలు సంధిస్తున్నాడు. ఆ లేఖల్లో ఇదిగో ఇలా మొత్తం మీరే చేశారు. ఫిబ్రవరి 13న మీకు ఆఫర్ ఇచ్చా. ఆ ఆఫర్ ను కూడా కాదన్నారు. దీనంతటికి కారణం నేను కాదు మీరే . నేను అమాయకుణ్ని. దయచేసి నన్న తప్పుపట్టవద్దంటూ ఎదురుదాడికి దిగుతున్నాడు. దీనికితోడు ఆయన తరఫు వకీళ్లు అనుచర వర్గం మాత్రం ఇందులో నీరవ్ మోడీ నిర్దోషి అని టూజీ కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుందని బుకాయిస్తున్నారు. మొత్తానికి మోడీ కేసు రోజుకో మలుపులు తిరుగుతుంది. ఈనేపథ్యంలోదొంగ ఎలుకలు కలుగులో దాక్కుంటే..కలుగు ముందు మంట పెడితే ఆ వేడికి అన్ని ఎలుకలు బయటికి వస్తాయో. వేలకోట్లు కుంభకోణం చేసి తప్పించుకుంటున్న నీరవ్ మోడీ బాధితులు ఒక్కొక్కళ్లుగా వెలుగులోకి వస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారంటే స్టేటస్ అడ్డం వచ్చి సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు సీబీఐ అండతో టైమ్ లైన్ లోని వస్తున్నారు. పెద్ద చేపలను పట్టుకోవడానికి చిన్నచేపలను ఎలా ఎరవేస్తారో.. కలుగులో దాక్కున్న నీరవ్ మోడీని పట్టుకునేందుకు హీరోయిన్లను ఎరవేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

ఇప్పటికే  బ్యాంకుల దోచుకున్న డబ్బుతో  మోడీ బాలీవుడ్ ఫేమస్ యాక్టర్లతో తన వ్యాపారాన్ని దేశ- విదేశాలకు  విస్తరించేవారు.  ప్రియాంక చోప్రా - కరీనా కపూర్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - సోనమ్ కపూర్ - లిసా హాయ్డన్ తో పాటు బాలీవుడ్ నుండి మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.  2107లోనే మోడీ వ్యాపారానికి బ్రాండ్ అంబాసీడర్ గా ఉన్న తనని మోసం చేశాడని  ప్రియాంక చోప్రా ఆరోపించింది. ఇదిలా ఉండగా  నీరవ్ తనని మోసం చేసాడంటూ కంగానా - బిపాసా పసు మీడియా ముందుకు వచ్చారు.

 2016నుంచి కంగానా గీతాంజలి  బ్రాండ్ నక్షత్ర బ్రాండ్ అంబాసీడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఒప్పందం ప్రకారం మొత్తం సొమ్ము చెల్లించలేదని  ఎకనామిక్స్ టైమ్స్ కథనాల్ని ప్రసారం చేసింది.

మరోవైపు బిపాసా కూడా పలు ఆరోపణలు చేసింది.  గీతాంజలీకి చెందిన గిలికి బ్రాండ్ అంబాసీడర్ ఉన్నట్లు చెప్పంది. 2008లో  కాంట్రాక్ట్ ముగిసినా తన ఫోటోల్ని వాడుకున్నారని ఆరోపించింది. దీనిపై సదరుసంస్థ మేనేజర్ ను సంప్రదించగా ఫలితంలేదని వాపోయింది.