Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటిని నమ్ముకుని వాళ్లు ముగినిపోయార‌ట‌!

By:  Tupaki Desk   |   11 Dec 2018 8:38 AM GMT
ల‌గ‌డ‌పాటిని నమ్ముకుని వాళ్లు ముగినిపోయార‌ట‌!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారిపోయాయి. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ ఎస్‌) ఆ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో బొటాబొటీ మెజారిటీతోనే గ‌ట్టెక్కింది. అలాంటిది రాష్ట్రంలో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... ప్ర‌జ‌లు ఇచ్చిన ఐదేళ్ల అధికారాన్ని కూడా పూర్తి చేయ‌లేక ముంద‌స్తుకు పోయాడంటూ విప‌క్షాలు దుమ్మెత్తిపోశాయి. ఫ‌లితంగా ఈ ద‌ఫా టీఆర్ ఎస్‌ కు - ఆ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు ప్ర‌జ‌లు గ‌ట్టిగానే బుద్ధి చెబుతార‌ని ప్ర‌జా కూట‌మి కాస్తంత గ‌ట్టి న‌మ్మ‌కాలే పెట్టుకుంది. అయితే పోలింగ్‌ కు ఓ రెండు రోజుల ముందుగా ప్ర‌జ‌ల నాడి తెలిసిన ప్ర‌జా కూట‌మి - ఆ కూట‌మిలో కీల‌క రోల్ పోషించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చాలా తెలివిగా త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టిన‌ట్టుగా ప్ర‌చారం సాగింది. ఆ వ్యూహాల్లో భాగంగా టీఆర్ ఎస్‌ కు అనుకూలంగా ఉన్న ఓట‌రు మ‌న‌సును మార్చేందుకు ఎన్నిక‌ల ముంద‌స్తు అంచ‌నాల‌ను ప‌క్కాగా లెక్క‌గ‌ట్ట‌డంలో సిద్ధ‌హ‌స్తుడ‌ని పేరున్న మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ ను రంగంలోకి దించేశారు. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుడు - త‌మ సామాజిక వ‌ర్గానికి చుక్కానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు మాట చెవిన‌ప‌డిందే త‌డ‌వుగా క్ష‌ణ కాలం ఆల‌స్యం చేయ‌కుండా రంగంలోకి దిగేసిన ల‌గ‌డ‌పాటి... అప్ప‌టిదాకా త‌న‌కు తానుగా స‌ర్వే చేసిన గ‌ణాంకాల‌ను ఒక్క‌సారిగా మార్చేశారు.

అయితే ఆ అంకెల గార‌డీ అంతా బూట‌క‌మ‌నే విష‌యం నేటి ఉద‌యం నుంచే మొద‌లైన కౌంటింగ్ ట్రెండ్స్ ఇట్టే తేల్చి పారేశాయి. అయితే చంద్ర‌బాబు ప‌న్నిన ఆ వ్యూహంలో భాగంగా త‌న లెక్క‌ల‌ను తానే మార్చేసిన నిజం ఒక్క ల‌గ‌డ‌పాటికి మాత్ర‌మే తెలుసు. ల‌గ‌డ‌పాటి మార్చిన లెక్క‌ల మంత్రం చంద్ర‌బాబుకు కూడా తెలుస‌నుకోవాల్సిందే. ఎందుకంటే... ప్ర‌జ‌ల నాడిని ప‌ట్ట‌డంలో చంద్ర‌బాబు దిట్ట కింద లెక్కే క‌దా. ఆ దిశ‌గా ప్ర‌జ‌ల మూడ్‌ ను మార్చేందుకే ర‌చించిన ఈ వ్యూహం మాత్రం బాబు వ‌ర్గం ముఖ్యంగా బాబు సామాజిక వ‌ర్గానికి పూర్తిగా అర్థం కాలేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... కేవ‌లం ల‌గ‌డ‌పాటి స‌ర్వేను మాత్ర‌మే ఆధారంగా చేసుకుని ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన చాలా మంది తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై భారీ స్థాయిలో బెట్టింగులు కాశారు. నిన్న సాయంత్రం దాకా అదే ప‌రిస్థితి. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌నం మూడ్‌ను క‌రెక్ట్ గా అంచ‌నా వేయ‌డంలో ల‌గ‌డ‌పాటికి ఇప్ప‌టిదాకా ఉన్న రికార్డుల‌ను బేరీజు వేసుకున్న మీద‌టే... ఆ సామాజిక వ‌ర్గ‌మంతా ప్ర‌జా కూట‌మి గెలుస్తుంద‌ని కోట్ల‌కు కోట్లు పెట్టి మ‌రీ బెట్టింగులు కాశార‌ట‌.

అయితే నిన్న సాయంత్రానికి ల‌గ‌డపాటి అంచ‌నాపై ఓ అవ‌గాహ‌న వ‌చ్చి బెట్టింగుల్లో పెట్టిన డ‌బ్బు వెన‌క్కు తీసుకుందామ‌నుకున్నా... కుద‌ర‌లేద‌ట‌. ఎందుకంటే... తెల్లారితే కౌంటింగ్ స్టార్ట్ అవుతున్న నేప‌థ్యంలో నిన్న సాయంత్రానికే బెట్టింగ్ నిర్వాహ‌కులు పందేల‌ను తీసుకోవ‌డం - ఉప‌సంహ‌రించ‌డాన్ని నిలిపేశార‌ట‌. దీంతో ఏదైతే అదే అవుతుందిలే అంటూ వేచి చూడ‌టం మిన‌హా వారు ఏమీ చేయ‌లేక‌పోయార‌ట‌. నేటి ఉద‌యం వెలువ‌డిన ఫ‌స్ట్ ట్రెండ్స్ చూడటంతోనే ఆ వ‌ర్గ‌మంతా తాము మునిగిపోయామ‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చార‌ట‌. మొత్తంగా త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడే కాకుండా - స‌ర్వేల‌పై నిక్క‌చ్చి ఫ‌లితాల‌ను వెలువ‌రిస్తార‌ని భావించిన ల‌గ‌డ‌పాటిని న‌మ్మినందుకు తామంతా మునిగిపోయామ‌ని ఇప్పుడు ఆ సామాజిక వ‌ర్గ‌మంతా ల‌బోదిబోమంటున్నార‌ట‌. ఒక్క‌డ కొస‌మెరుపేమంటే... ల‌గ‌డ‌పాటికి ఉన్న ట్రాక్ రికార్డు తెలిసి కూడా ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తి... ల‌గ‌డ‌పాటి స‌ర్వేకు వ్య‌తిరేకంగా పందెం కాసి ఏకంగా రూ.10 ల‌క్ష‌లు గెలుచుకున్నాడ‌ట‌.