Begin typing your search above and press return to search.

ద‌ద్ద‌మ్మ‌ల్ని గెంటేద్దాం రండి: కమల్

By:  Tupaki Desk   |   21 Feb 2018 7:43 AM GMT
ద‌ద్ద‌మ్మ‌ల్ని గెంటేద్దాం రండి: కమల్
X

సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి అన్నీ సిద్ధం చేసుకున్న విష‌యం తెలిసిందే. రాకీయాల్లోకి వ‌స్తూ వ‌స్తూనే త‌న ప్ర‌త్యర్ధుల‌పై శివాలెత్తారు. ప్ర‌భుత్వాన్ని చేత్త‌కాని ద‌ద్ద‌మ్మ‌తో పోల్చిన క‌మ‌ల్ ప్ర‌తిప‌క్ష‌పార్టీ డీఎంకే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ కు నేను కాగిత‌పు పువ్వును కాదు. విత్తానాన్ని నాటితే ఏపుగా పెరుగుతా అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. మొత్తానికి క‌మ‌ల్ విమ‌ర్శ‌లు - ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు.

క‌మల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆ రోజు రానే వ‌చ్చింది. ఇవ్వాళ సాయంత్రం మ‌ధురైలో త‌న రాజ‌కీయ ప్ర‌స్ధానాన్ని ప్రారంభింస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ - బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు వామపక్ష నేతలు హ‌జ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో డీఎంకే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ ర‌జినీ కాంత్ - క‌మ‌ల్ హాస‌న్ లు కాగిత‌పు పువ్వుల‌ని విమ‌ర్శించారు. రుతువులు మారిన‌ప్ప‌డు కొన్ని కాగిత‌పు పువ్వులు అందంగా క‌నిపిస్తాయే త‌ప్పా ..సువాస‌న‌లు వెద‌జ‌ల్ల‌వు అంటూ ద్వ‌జ‌మెత్తారు.

దీనిపై స్పందించిన క‌మల్ ‘నేను కాగితపు పువ్వును కాదు - విత్తనాన్ని. నాటి చూస్తే ఏపుగా పెరుగుతాను. విత్తనాన్ని ఎవరూ వాసన చూడాల్సిన పని లేదు’ అని వ్యాఖ్యానించారు. అనంత‌రం భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స‌మాధిని ద‌ర్శించుకుని నివాళుల‌ర్పించారు.

అక్క‌డి నుంచి రామేశ్వరంలో ఉన్న కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్ తో క‌మ‌ల్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా లెబ్బాయ్ కి చేతిగ‌డియారాన్ని బ‌హుమానంగా అంద‌జేసి ఆయ‌న ఆశీర్వాధం తీసుకున్నారు. పార్టీ ఏర్పాటుపై ఆనందం వ్య‌క్తం చేసిన క‌లాం సోద‌రుడు క‌మ‌ల్ స్థాపించే కొత్త‌పార్టీ విజ‌యం సాధించాల‌ని ప్రార్ధ‌న‌లు చేశారు. అబ్దుల్ కలామ్ ఆశీర్వాధం కమల్ హాసన్ కు ఎప్పుడూ ఉంటుందని మహమ్మద్ ముతుమీర్ లెబ్బాయ్ చెప్పారు.

అనంత‌రం రామేశ్వ‌రంలో ఉన్న మ‌త్స్య‌కారుల‌తో భేటీ అయిన క‌మ‌ల్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. తమిళ‌నాడు ప్ర‌భుత్వం అన్నాడీఎంకే ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. మ‌త్స్య‌కారుల హామీల్ని ఎందుకు నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు. తాము అధికారంలోకి వ‌స్తే మీ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

అంతేకాదు శ్రీలంక అధికారుల ఆగ‌డాల నుంచి మిమ్మ‌ల్ని ర‌క్షించేలా చ‌ర్య‌లు తీసుకుంటానని . ఇలాంటి చేతకాని ప్రభుత్వానికి ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉండాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ఓఖీ తుపాను బాధితుల్ని ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని సూచించారు.