Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ పాలిటిక్స్‌ పై..అన్నాడీఎంకే కౌంట‌ర్!

By:  Tupaki Desk   |   26 Sep 2017 10:22 AM GMT
క‌మ‌ల్ పాలిటిక్స్‌ పై..అన్నాడీఎంకే కౌంట‌ర్!
X
త‌మిళ‌నాట రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. రెండు కామెంట్లు... ఆరు కౌంట‌ర్ల చందంగా సాగుతున్న ఈ ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయంలో పాత్ర‌లు అప్ప‌టిక‌ప్పుడే చాలా వేగంగా మారిపోతున్నాయి. అస‌లు ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న విష‌యం అంచ‌నా వేయ‌డానికే సాధ్యం కావ‌డం లేని ప‌రిస్థితి అక్క‌డ నెల‌కొని ఉందంటే... అతిశ‌యోక్తి కాదేమో. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఒక్క‌సారిగా మారిపోయిన అక్క‌డి రాజ‌కీయ చిత్రంలో... కేవ‌లం పొలిటీషియ‌న్లు మాత్ర‌మే పాలిటిక్స్ గురించి మాట్లాడాల‌న్న రూలేమీ క‌నిపించ‌డం లేదు. స్టార్ హీరో, వారి ముఖ్య అనుచ‌రులు కూడా పొలిటిక‌ల్ కామెంట్లు చేస్తున్నారు. వెర‌సి ఒక్క తంబీల‌నే కాకుండా మొత్తం దేశ ప్ర‌జ‌ల‌నే త‌మిళ రాజ‌కీయాలు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేసేందుకు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నారంటూ చాలా కాలం నుంచి ప్ర‌చారం సాగుతున్నా... ఇప్ప‌టిదాకా త‌లైవా నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చిందే లేదు.

అయితే ఆ త‌ర్వాత బుల్లి తెర షో బిగ్ బాస్ పై విమ‌ర్శ‌ల పుణ్య‌మా అని రంగంలోకి దిగిన మరో త‌మిళ సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ తెరంగేట్రానికి సంబంధించి విస్ప‌ష్టంగానే ప్ర‌క‌ట‌న జారీ చేశారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... త‌మిళ‌నాడు భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో ప్ర‌తిస్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడులో నానాటికీ విస్త‌రిస్తున్న డెంగ్యూ జ్వ‌రాల‌పై ఆయ‌న నిన్న చేసిన ఓ కామెంట్ ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి ప్ర‌భుత్వానికి కాలేలా చేసింద‌ని చెప్పక త‌ప్ప‌దు. క‌మ‌ల్ ట్విట్ట‌ర్‌ లో పెట్టిన పోస్ట్‌ ను చూసిన వెంట‌నే రంగంలోకి దిగేసిన త‌మిళ‌నాడు మంత్రి జ‌య‌కుమార్ నేరుగా మీడియా ముందుకు వ‌చ్చేశారు. క‌మ‌ల్‌ పై త‌న‌దైన శైలిలో పంచ్‌ లు వేస్తూ జ‌య‌కుమార్ చాలా విష‌యాల‌నే మాట్లాడారు.

అస‌లు రాజ‌కీయాలు అంటే ఏమిటో క‌మ‌ల్‌ కు తెలిసిన‌ట్లుగా లేద‌ని మొద‌లెట్టిన జ‌య‌కుమార్‌... రాజకీయాలు అంటే 100 రోజులు ఆడే సినిమా కాదని కమల్ హాసన్ గ‌మ‌నించాల‌ని సెటైర్ వేశారు. కేవలం అధికారం కోసమే కమల్ హాసన్ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను సీఎం అయిపోతాను అంటున్న కమల్ హాసన్ కు అసలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఆయన కొత్త పార్టీ పెట్టిన తరువాత రాజకీయాల గురించి మాట్లాడితే బాగుంటుంద‌ని మ‌రో పంచ్ వేశారు. ముఖ్యమంత్రి పదవి అంటే మార్కెట్ లో దొరికే బొమ్మ కాదని, ప్రజలు గుర్తించి వారు అంగీకరించి ఓట్లు వేస్తే పదవులు వస్తాయనే విషయం కమల్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ట్విట్టర్ లో ట్వీట్లు చేసుకుంటుంటే సీఎం అయిపోతారా అని కమల్ హాసన్ ను ప్రశ్నించారు.

గతంలో క‌మ‌ల్ కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న నటుడు శివాజీ గణేశన్ రాజకీయాల్లోకి వచ్చి ఘొరంగా దెబ్బతిన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని, తొందరపడి రాజకీయాల్లో వస్తే కమల్ కూ అదే గతి పడుతుందని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. సినిమా నటులు మీటింగ్ పెడితే లక్షల్లో ప్రజలు వస్తారన్న జ‌య‌కుమార్‌... అయితే వారిలో ఎంత మంది ఓట్లు వేస్తారో ఆలోచిస్తే మంచిదని కమల్ హాసన్ కు హితవుపలికారు. సోషల్ మీడియాలో కామెంట్లు చెయ్యడం కాదు, మొదట ఆయన్ను (కమల్ హాసన్)ను రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి రమ్మని మీరైనా చెప్పండి అంటూ ఆయ‌న‌ మీడియా ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

*1955లో శివాజీ గణేశన్ డీఎంకేకి మద్దతు ఇచ్చారు. తరువాత కామరాజ్ మనవి మేరకు కాంగ్రెస్ లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇందిరాగాంధీ అనంతరం ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి 1987లో తమిజగ మున్నేట్ర మున్నాని అనే సొంత పార్టీ పెట్టి రెండు సంవత్సరాల్లోనే జనతాదళ్ లో పార్టీని విలీనం చేసిన శివాజీ గణేశన్ ఘోరంగా రాజకీయాల్లో విఫలం అయ్యారు. అలాంటి మహానటుడే రాజకీయాల్లో విఫలం అయ్యాడని, కమల్ హాసన్ ఎంత?* అని మంత్రి జయకుమార్... క‌మ‌ల్‌ పై ఓ రేంజీలో ఫైర‌య్యారు. మ‌రి ఈ కామెంట్ల‌పై క‌మ‌ల్ ఎలా స్పందిస్తారో చూడాలి.