Begin typing your search above and press return to search.

కమ‌ల్ కారు రాజ‌కీయం అదిరింది

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:11 AM GMT
కమ‌ల్ కారు రాజ‌కీయం అదిరింది
X
కమల్ హాసన్ తన కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి21న రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం సమాధిని దర్శించుకొని అక్కడి నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. ముధురై ఒత్తకడాయ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కమల్ తన కొత్తపార్టీపై ప్రకటన చేశారు.అభిమానుల కరతాళధ్వనుల మధ్య ప్రజా న్యాయ కేంద్రం (పీపుల్స్ జస్టిస్ సెంటర్) అని దీని అర్థం వచ్చేలా తన పార్టీ పేరు ‘మక్కల్ నీధి మయ్యం’గా వెల్లడించారు. అనంతరం కమల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కమల్ పార్టీ ప్రారంభోత్సవానికి హాజరై ప్రసంగించారు.

అయితే ఈ పార్టీ ప్రకటనముందే కమల్ హాసన్ పెద్ద కసరత్తే చేసినట్లు తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ లో వివరించారు. కమల్ తమిళమ్యాగజైన్ ఆనంద వికటన్ అనే కాలం రాస్తారు. ఆ కాలంలో ప్రస్తుత అంశాల్ని పరిగణలోకి తీసుకొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటనపై కమల్ రజనీతో ఓ కారులో కూర్చొని సీక్రెట్ గా మాట్లాడుకున్నట్లు వివరించారు. రాజకీయాలకు రాకముందే తాను యాంకర్ గా వ్యవహరించిన తమిళ బిగ్ బాస్ షూటింగ్ పూనమల్లెలోని ఓ ప్రైవేటు స్టూడియోలు జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో పారా రంజిత్ డైరక్షన్ రజనీకాంత్ కాలా షూటింగ్ జరుగుతుండగా..తాను రజనీతో సీక్రెట్ గా మాట్లాడినట్లు తెలిపారు.

రజనీతో రహస్యంగా ఓ కారులో కూర్చొని మాట్లాడుకున్నాం. తన రాజకీయంపై చర్చిస్తే తొలత రజనీ షాక్ తిన్నట్లు మ్యాగజైన్ లో వివరించారు. రాజకీయాల్లో రావాలని అన్నీ విధాలుగా సిద్ధపడ్డ తాను ..రాజకీయంగా రజనీకాంత్ తో హుందాగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు కమల్ చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ ఓ అంశంపై కమల్ ను అభినందించాల్సిందే. ప్రాణస్నేహితులుగా ఉన్న కొంతమంది రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రాణస్నేహితుణ్ని సైతం బద్ధశత్రువుగా భావిస్తారు.

కానీ కమల్ హాసన్ రజనీతో స్నేహాన్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఎవరికివారు అభిమానులు ఉన్నా . ఒకరిపై ఒకరు పరస్పర దాడులు ఆరోపణలకు దూరంగా ఉండాలని హితువు పలికారు కమల్ హాసన్. రాజకీయాల్లో తామెంతా హుందాగా వ్యవహరిస్తామో అభిమానులుకూడా అంతే హుందాగా వ్యవహరించాలని సూచించారు.

ఇదిలా ఉంటే క‌మ‌ల్ రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌పై ర‌జినీకాంత్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 'మక్కల్‌ నీది మయ్యం' (ఎంఎన్‌ ఎం) పార్టీని ప్ర‌క‌టిస్తూ క‌మ‌ల్ చేసిన ప్ర‌సంగానికి ఫిదా అయిన‌ట్లు కొనియాడారు. త‌మ పార్టీలు - ప‌ద్ద‌తులు వేరైనా ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని దృక్ప‌థంతో ప‌నిచేస్తున్న‌ట్లు తలైవా పున‌రుద్ఘాటించారు.