Begin typing your search above and press return to search.

ర‌జనీ పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇదే నిద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   26 May 2017 11:13 AM GMT
ర‌జనీ పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇదే నిద‌ర్శ‌నం
X
త‌లైవా, త‌మిళ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడో రాడో ఇంకా తెలియ‌దు గానీ... ఆయ‌న ఎంట్రీపై మాత్రం మ‌రో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అత‌ని లేటెస్ట్ మూవీ కాలా ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ఫ‌స్ట్‌ లుక్ ద్వారా త‌న ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పాడని అంటున్నారు. ఈ ఫ‌స్ట్‌ లుక్‌ లో ర‌జనీ ఓ జీపుపై కూర్చొని ఉంటాడు. అయితే ఆ జీపు నంబ‌ర్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. త‌న పొలిటిక‌ల్ ఎంట్రీని ర‌జ‌నీ ఇలా చెప్పాడా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

కాలాలోని జీపు నంబ‌ర్ ప్లేట్‌ ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. ఎంహెచ్‌01బీఆర్‌1956.. ఈ నంబ‌ర్‌ లో ఏముందో గుర్తించారా? బీఆర్ అనేది మ‌న రాజ్యాంగ నిర్మాత‌ అంబేద్క‌ర్ పేరు. ఇక 1956 అనేది ఆయ‌న బౌద్ధ మ‌తాన్ని స్వీక‌రించిన ఏడాది. ద‌ళితుల అభ్యున్న‌తి కోసం పోరాడిన నేత‌ను త‌న పోస్ట‌ర్‌ లో స్ఫురించేలా చేయ‌డం వెనుక ర‌జ‌నీ ఉద్దేశం ఏంటి అన్న‌ది అస‌లు చర్చ‌. క‌బాలీలోనూ ర‌జ‌నీ ఇలాంటి పాత్ర‌నే పోషించాడు. ఇప్పుడు కాలాలోనూ అలాంటి రోల్‌లోనే క‌నిపించి ద‌ళితుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ర‌జ‌నీ భావిస్తున్నారా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాగా, ఈ పోస్ట‌ర్ అంబేద్క‌ర్‌ ను ఉద్దేశించి పెట్టిన‌దేనా అని ర‌జ‌నీ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు రంజిత్‌ ను ప్ర‌శ్నించ‌గా.. దీనిని ఎవ‌రు ఎలాగైనా విశ్లేషించుకోవ‌చ్చు అని స‌మాధాన‌మిచ్చాడు. ఓ కార‌ణం కోసం పోరాటం చేసే వ్య‌క్తిగా ర‌జ‌నీ క‌నిపిస్తాడు అని అత‌ను చెప్పాడు. మే 28 నుంచి సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. చెన్నై - ముంబైల‌లో సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇంత‌కీ రజ‌నీ మ‌న‌సులో ఏముందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/