Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదాపై ఒక రోజు ముందే...

By:  Tupaki Desk   |   27 July 2016 11:01 AM GMT
ప్రత్యేక హోదాపై ఒక రోజు ముందే...
X
ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజ్యసభలో మళ్లీ శుక్రవారం చర్చకు వస్తుందనుకుంటున్న తరుణంలో ఒక రోజు ముందే అందుకు ముహూర్తం నిర్ణయించారు. ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభ అఖిలపక్ష సమావేశం ఈ రోజు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నిత్యమూ అట్టుడుకుతున్న రాజ్యసభలో - వాయిదాలు పడటం మినహా - మరే విధమైన కార్యకలాపాలూ సాగక పోవడంతో డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ అఖిలపక్ష నేతలను పిలిచి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాగా, చర్చకు మాత్రమే అనుమతిస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేయగా - దీనిపై ఓటింగ్ కు కూడా కాంగ్రెస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

కాగా రాజ్యసభలో చర్చకు రానున్న ప్రత్యేక హోదా అంశంపై ఏపీ పార్టీలో దేనికవి తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు భేటీ కాగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా జరిగింది. మిత్రపక్షం బీజేపీని ఈ విషయంలో ఎండగట్టేయాలని టీడీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఎలాగైనా దీన్ని ఓటింగు వరకు వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండగా ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని కాంగ్రెస్ అంటోంది.

ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో రచ్చ తప్పదని అర్థమవుతోంది. మొన్నటి లాగే తమ పార్టీ సభ్యులందరినీ తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీచేయడానికి రెడీ అవుతోంది. టీడీపీ కూడా తమ సభ్యులను అందుబాటులో ఉండాల్సిందిగా కోరింది. దీంతో గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలో ఏర్పడింది.