Begin typing your search above and press return to search.

మంత్రి కేటీఆర్‌ కు ద‌స‌రా సెలవులు

By:  Tupaki Desk   |   23 Sep 2017 8:04 AM GMT
మంత్రి కేటీఆర్‌ కు ద‌స‌రా సెలవులు
X
అదేంటి....మంత్రి కేటీఆర్ అంటే ఏమైనా స్కూల్ పిల్లోడా? టీఆర్ ఎస్ యువ నాయ‌కుడిగా ప్ర‌చారంలో ఉన్నాడు. రాష్ట్రంలో ఐదారు కీల‌క శాఖ‌ల‌కు ఆయ‌న‌కు బాధ్య‌త వ‌హిస్తున్నాడు. అందరు మంత్రుల వ‌లే ఆఫీసుకు వ‌చ్చి, లేదా త‌న‌ను క‌లిసి ద‌ర‌ఖాస్తు ఇస్తేనే ప‌నులు అవుతాయ‌ని భావించే టైపు కూడా కాదు..ట్విట్ట‌ర్‌లో టింగ్ అని ట్వీట్ చేస్తే చాలు స్పందించే కేటీఆర్ సెల‌వు తీసుకోవ‌డం ఏమిట‌ని అనుకోకండి. నిజంగానే మంత్రి కేటీఆర్ ద‌స‌రాకు సెల‌వులు తీసుకుంటున్నారు. సాక్షాత్తు ఆయ‌న తండ్రి - తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ సెల‌వులను ఓకే చేసేశారు.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... వ‌ర‌సుగా ప‌ని ఒత్తిళ్లు - కౌంట‌ర్ ఆప‌రేష‌న్ల త‌ర్వాత మంత్రి కేటీఆర్ సెల‌వు తీసుకుంటున్నారు. ఈ విష‌యం మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తు మంత్రి కేటీఆరే ఆయ‌న ట్విట్ట‌ర్‌ లో ప్ర‌క‌టించారు. ``సుదీర్ఘ కాలం త‌ర్వాత కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా సెల‌వుల‌కు వెళ్తున్నాను. వారం రోజుల పాటు విదేశాల టూరే. ప‌ని ఒత్తిడిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌డంలో ఈ టూర్‌ భాగం`` అంటూ త‌న వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ స‌మాచారాన్ని ఆషామాషీగా కూడా కాకుండా..గ‌తంలో దిగిన ఓ చ‌క్క‌ని ఫొటోతో కూడా క‌లిపి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇంత‌కీ మంత్రి కేటీఆర్ సెల‌వుల‌పై ఆయ‌న తండ్రి - సీఎం కేసీఆర్ మంజూరు చేశార‌నే విష‌యాన్ని క్లారిటీగా చెప్ప‌లేదు అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం....అత్యంత‌ విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సీఎం కేసీఆర్ సైతం కేటీఆర్ టూరుకు ఓకే చెప్పేశార‌ట‌. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన బతుక‌మ్మ చీర‌ల పంపిణీ మొద‌టి రోజు ర‌చ్చ ర‌చ్చకావ‌డం, చీర‌లు ద‌గ్దం చేసిన ఎపిసోడ్‌ లో కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి ప‌రిస్థితి చ‌క్క‌దిద్ద‌డం, ఆ త‌దుప‌రి చీర‌ల పంపిణీ సాఫీగా సాగుతున్న నేప‌థ్యంలో...మంత్రి కేటీఆర్ త‌న విదేశీ ప‌ర్య‌ట‌న గురించి చెప్ప‌గానే..కేసీఆర్ ఓకే చేసేశార‌ని స‌మాచారం. ఇంత‌కీ ఏ దేశానికి మంత్రి కేటీఆర్ వెళ్లాడ‌నేగా మీ సందేహం....ఇటలీ అని తెలుస్తోంది.!