Begin typing your search above and press return to search.

స్విచ్ఛాఫ్ చేస్తారా..? మీటింగ్ నుంచి వెళతారా.?

By:  Tupaki Desk   |   15 Jun 2018 8:36 AM GMT
స్విచ్ఛాఫ్ చేస్తారా..? మీటింగ్ నుంచి వెళతారా.?
X
హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జరిపిన మీటింగ్ లో పలువురు నాయకులు, అధికారుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే బయటకు వెళ్లిపోండి అంటూ హెచ్చరించారు..

కేటీఆర్ వివిధ సమస్యలపై సమావేశం మొదలు కాగానే పలువురి సెల్ ఫోన్లు అదే పనిగా మోగాయి. అయినా వారు కట్ చేస్తూ వచ్చారు. నిమిష నిమిషానికి ఫోన్లు మోగడంతో కేటీఆర్ ప్రసంగానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్ చేయాలని.. లేదా మీటింగ్ పూర్తి అయ్యేవరకూ సైలెంట్ మోడీలో పెట్టాలని సూచించారు. ఒకవేళ మీరు ఇలాగే మీటింగ్ ను డిస్ట్రబ్ చేయాలనుకుంటే బయటకు వెళ్లిపోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరైతే బిజీగా ఉండే రాజకీయ నేతలు, అధికారులు దయచేసి ఇలాంటి మీటింగ్ లకు ఫోన్లను తీసుకురావద్దని కేటీఆర్ అల్టీమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు కేటీఆర్ హితబోధ చేశారు. జీహెచ్ఎంసీలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని.. ఎవరి డ్యూటీ వారు చేస్తే ప్రజల నుంచి పొగడ్తలు వస్తాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్యం బాగుండాలంటే మున్సిపాలిటీ సిబ్బంది బాగా పనిచేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో మున్సిపల్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ప్రజలు తనకు సమస్యలపై రోజుకో ఫిర్యాదు చేస్తున్నారని .. తాను ప్రజల తరఫున అధికారులను అడుగుతున్నానని కేటీఆర్ సీరియస్ అయ్యారు.