Begin typing your search above and press return to search.

భేటీ టైం చెప్పేస్తూ.. ట్వీట్ చేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   16 Jan 2019 9:17 AM GMT
భేటీ టైం చెప్పేస్తూ.. ట్వీట్ చేసిన కేటీఆర్
X
పండుగ వేళ‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు ఒకింత హ్యాపీ మూడ్ లో ఉంటారు. త‌మ‌కు తోచిన‌ట్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటివి వేళ‌.. అన్ని నెమ్మ‌దిగా సాగుతున్న‌ట్లుగా ఉంటాయి.ఒకింత బ‌ద్ధ‌కం స‌ర్వ‌త్రా క‌నిపిస్తూ ఉంటుంది. అలాంటి ప‌రిస్థితి ఈసారి మిస్ అయ్యేలా చేస్తూ కొత్త ప‌రిణామం చోటు చేసుకుంది.

భోగి.. సంక్రాంతి ముగిసి.. క‌నుమ సంబ‌రాల‌కు రెఢీ అవుతున్న వేళ‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఇద్ద‌రు భేటీ కానున్న‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారింది. పండ‌గ సెల‌బ్రేష‌న్స్ స్థానే ఇప్పుడీ సంచ‌ల‌న భేటీ వెనుక కార‌ణాలు ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. త‌న‌తో భేటీ కోసం కేటీఆర్ ప్ర‌తిపాద‌న‌కు జ‌గ‌న్ రియాక్ట్ అయిన‌.. త‌న ఇంటికి ఈ రోజు (బుధ‌వారం) లంచ్ కు రావాల‌న్నారు. దీంతో.. వీరిద్ద‌రి భేటీ మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌టమేకాదు.. స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తెర తీసింది.

ఇదిలా ఉంటే.. ఈ భేటీని మ‌రింత ఊరిస్తూ తాజాగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను.. జ‌గ‌న్ ఇద్ద‌రం ఈ మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు క‌ల‌వ‌నున్నట్లు పేర్కొన్నారు. మ‌రి.. ఈ ఇద్ద‌రు యువ అధినేత ములాఖ‌త్ వెనుక మ‌ర్మం ఏమిటి? వీరిద్ద‌రి మధ్య ఏయే అంశాలు చ‌ర్చ‌కు రానున్నాయి? ఇద్ద‌రికి ఉమ్మ‌డి రాజ‌కీయ శ‌త్రువైన చంద్ర‌బాబుపై ఏ విధంగా విరుచుకుప‌డ‌నున్నారు? లాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రి మ‌దిని తొలిచేస్తున్నాయి. ఏమైనా.. ఈ ఇద్ద‌రు అధినేతల‌ భేటీ కార‌ణంగా పండ‌గ మ‌త్తు వ‌దిలిపోయి.. రాజ‌కీయం వైపు అంద‌రి దృష్టి మ‌ళ్లేలా చేసింద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు.