Begin typing your search above and press return to search.

తండ్రిపై కేటీఆర్ ట్వీట్ అదిరిందిగా!

By:  Tupaki Desk   |   27 April 2017 5:03 AM GMT
తండ్రిపై కేటీఆర్ ట్వీట్ అదిరిందిగా!
X
సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌ గా ఉండే టీఆర్ ఎస్ యువనేత, తెలంగాణ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు నిన్న రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ ఎస్‌) ఆవిర్భ‌వించి 16 ఏళ్ల‌వుతున్న త‌రుణాన్ని పుర‌స్క‌రించుకుని కేటీఆర్ చేసిన ట్వీట్ నిజంగానే అంద‌రి దృష్టినీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింద‌ని చెప్పాలి. టీఆర్ ఎస్ 16 ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న తండ్రి కేసీఆర్ పెయింటింగ్‌ ను ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసిన కేటీఆర్‌... దానికి ఓ ఇంట‌రెస్టింగ్ కామెంట్‌ ను కూడా జోడించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ‌ను సాకారం చేసిన నేత‌గా కేసీఆర్‌ ను అభివ‌ర్ణించిన కేటీఆర్‌... నిన్న‌టిదాకా ఉద్య‌మ యోధుడిగా క‌నిపించార‌ని, ఇప్పుడేమో... ఉత్త‌మ పాల‌కుడిగానూ క‌నిపిస్తున్నార‌ని త‌న తండ్రికి కితాబిచ్చారు. ఇక కేటీఆర్ పోస్ట్ చేసిన కేసీఆర్ పెయింటింగ్ కూడా ఇట్టే ఆక‌ట్టుకునేలా ఉంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రాంతం ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన సంద‌ర్భంగా కేసీఆర్ మోములో క‌నిపించిన సంతోషం స్ప‌ష్టంగా క‌నిపించేలా పెయింటింగ్ గీయించిన కేటీఆర్‌... దానికి త‌న‌దైన శైలి కామెంట్‌ను జోడించి... ఆ పోస్టుకు మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చారు.

స‌ద‌రు పెయింటింగ్ లో కేసీఆర్ ముఖం మాత్ర‌మే క‌నిపిస్తుండ‌గా. రైట్ సైడ్ చూపులతో కేసీఆర్ వెలిగిపోతోంది. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన పోస్టింగ్‌ ల‌ను సోష‌ల్ మీడియాలో గ‌తంలోనూ చాలా సార్లు కేటీఆర్ పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే నిన్న రాత్రి కేటీఆర్ పోస్ట్ చేసిన పెయింటింగ్ మాత్రం వాట‌న్నిటికంటే కూడా అమితాసక్తి క‌లిగించేదిగానే ఉంద‌ని చెప్పాలి. ఈ కార‌ణంగానేమో తెలియ‌దు గానీ... కేటీఆర్ ట్వీట్‌ కు చాలా మంది నెటిజ‌న్లు దానిని ఆకాశానికెత్తేస్తూ రీ ట్వీట్లు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/