Begin typing your search above and press return to search.

కేంద్రంతో ఓకే అంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   3 Dec 2016 9:43 AM GMT
కేంద్రంతో ఓకే అంటున్న కేటీఆర్‌
X
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి - తెలంగాణ స‌ర్కారుకు మ‌ధ్య పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మోడీ లేడు - గీడీ లేడు అని విమ‌ర్శించ‌డం - అనంత‌రం మోడీది ఫాసిస్టు పాల‌న‌గా అభివ‌ర్ణించారు. అయితే ఇపుడు అవ‌న్నీ సెట్ అయిపోయ‌య‌ని కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

కేంద్రంతో సంబంధాల విష‌యంలో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొంత ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి మిశ్రమంగా ఉంద‌ని కేటీఆర్‌ అన్నారు. హైకోర్టు విభ‌జ‌న‌, ఐటీఐఆర్ విషయంలోకూడా పురోగతి లేదని పోలవరం విషయంలో బాధపెట్టే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మ‌రికొన్ని విషయాల్లో సంతృప్తి కరంగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. నేషనల్ హైవేస్ విషయంలో విజ్ఞప్తి చేయగానే 50 ఏళ్ల‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే రెట్టింపు చేసుకోగలిగామ‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల విష‌యంలో కొంత సంతృప్తికరంగానే సహకరిస్తున్నారని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నోట్ల రద్దును ముందు వ్యతిరేకించి త‌ర్వాత స‌మ‌ర్థించార‌ని కాంగ్రెస్ విమ‌ర్శించ‌డం చిత్రంగా ఉంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రంగా శరవేగంగా ఎదుగుతున్న దశలో పెద్ద నోట్ల ర‌ద్దు దెబ్బ పడిందని - బాధ్యత కలిగిన ఏ సీఎం అయినా మథనపడుతాడని కేటీఆర్ చెప్పారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ప్రధాన మంత్రితో చర్చించాక నోట్ల రద్దుపై ఆయన పట్టుదలతో ఉన్నారని, దేశానికి మంచి జరుగుతుందని, పారదర్శకత పెరుగుతుందని అనుకున్నప్పుడు స్పందించామ‌ని వివ‌రించారు. వీధి పోరాటాల సమయం కాదని తాము రాజ‌నీతితో ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు.

రాజకీయంగా ఎవరేం మాట్లాడినా ప్ర‌జ‌లు మాత్రం టీఆర్ ఎస్ వెంట ఉంటున్నార‌ని కేటీఆర్ అన్నారు. మెదక్ ఉప ఎన్నిక నుంచి వరంగల్ ఉప ఎన్నిక - జీహెచ్‌ ఎంసీ - నారాయణఖేడ్ - పాలేరు - కార్పొరేషన్ - కంటోన్మెంట్ ఎన్నికలు ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఏకోన్ముఖంగా ప్రజలు ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పారని విశ్లేషించారు. గతంలో జీహెచ్‌ ఎంసీలో ఒక్క సీటూ లేని స్థితి నుంచి ఇప్పుడు 100 సీట్లు వచ్చాయ‌ని భ‌రోసా వ్య‌క్తం చేశారు. పాలేరులో గతంలో త‌మకు డిపాజిట్‌ కూడా రాలేదని, అలాంటిది ఉప ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్ల వరకు వచ్చాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీయే ఉండదని చెప్ప‌డం అతిశ‌యోక్తి, అహంకారం అవుతుందని కేటీఆర్ అన్నారు. పోటీ 99 శాతం కాంగ్రెస్ తోనే ఉంటుందని, కాకపోతే అడుగు, బొడుగు...గడ్డాలు పెంచుకున్న నాయకులతో పోటీ పడాల్సి వస్తుందేమోన‌ని ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/