Begin typing your search above and press return to search.

కేసీఆర్ రేప‌టి నుంచి అలా చేయ‌బోర‌ట‌

By:  Tupaki Desk   |   14 Dec 2018 3:59 PM GMT
కేసీఆర్ రేప‌టి నుంచి అలా చేయ‌బోర‌ట‌
X
గులాబీ ద‌ళ‌ప‌తి - టీఆర్ ఎస్ వ్య‌వస్థాప‌కులు కేసీఆర్ రోల్ మారిపోనుందట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. సాక్షాత్తు టీఆర్‌ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వాటిని తెలియ‌జెప్పారు. శుక్ర‌వారం టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశం అయింది.నేడు జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ఎన్నికైన కేటీఆర్‌ ను అభినందిస్తూ కార్యవర్గం తీర్మానం చేసింది. ఈ సంద‌ర్భంగా పార్టీ అధ్యక్షుడు - సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రేపు ఒంటి గంటకు టీఆర్‌ ఎస్ రాష్ట్ర కార్యవర్గం మరోమారు భేటీ కానుందని - పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుందని తెలిపారు.

పార్టీ - ప్రభుత్వం సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. రేపటి నుంచి పార్టీ నాయకులు - కార్యకర్తలకు కేటీఆర్ అందుబాటులో ఉంటారన్నారు. కేటీఆర్ పార్టీకి పూర్తిగా సమయం కేటాయిస్తారన్నారు. వచ్చే ఎన్నికలకు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. మొదటగా పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వీటిని బలోపేతం చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంచార్జ్ నియామకం చేపట్టాలన్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీ - ఇద్దరు సెక్రటరీలను నియామకం జరగాలన్నారు. కార్యాలయాల్లో శాఖల వారీగా సమాచారం అందుబాటులో పెట్టుకోవాలని పేర్కొన్నారు.

తాను - కే.కేశవరావు జాతీయ రాజకీయాల్లో - ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటా కాబట్టి మంత్రి కేటీఆర్ కు పార్టీ నిర్మాణ భాద్యతలు అప్పగించానని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీ నిర్మాణ భాద్యతలు కేటీఆర్ చూస్తారని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంపై ప్రధాన దృష్టి పెట్టాం.. క్షేత్ర స్థాయిలో నుంచి పార్టీ నిర్మాణం జరగాలన్నారు. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు.. ఇక నుంచి అన్ని విభాగాలు నిర్మాణం చేయాలన్నారు. వర్కింగ్ ప్రెసిండెంట్ రోజు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని కేసీఆర్ తెలిపారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు టీఆర్‌ ఎస్ పార్టీ గెలవాలని సీఎం అన్నారు.