Begin typing your search above and press return to search.

అప్ప‌టి అమెరికే బాగుందంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   25 Feb 2017 1:31 PM GMT
అప్ప‌టి అమెరికే బాగుందంటున్న కేటీఆర్‌
X
అమెరికాలోని కాన్సాస్ లో జాత్యాంకారి ఆడమ్స్ తూటాలకు బలైన కుచిబొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కుత్బుల్లాపూర్ లోని శంబీపూర్ లోని ప్రనీత్ హోంలో మంత్రులు కేటీఆర్ - మహేందర్ రెడ్డి పరామార్శించారు. స్థానిక ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు - ఎమ్మెల్యే వివేక్ - టీఆర్ ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లితో క‌లిసి శ్రీనివాస్ తల్లిదండ్రులు వర్ధిని - మదుసూధన్ రావు లను మంత్రులు ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని మంత్రులు హామీ ఇచ్చారు. త‌మ‌కు కలిగిన కష్టనష్టాలు ఏ తల్లిదండ్రులకు కలగరాదని, శ్రీనివాస్ తల్లిదండ్రులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తన వాళ్ళను వదిలి విదేశాల్లో కొలువు చేసుకుంటున్న వ్య‌క్తి విద్వేషక కాల్పుల్లో దుర్మరణం పాలుకావటం బాధాకరమ‌న్నారు. బంధువులు - సన్నిహితులు తల్లడిల్లుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ్రీనివాస్ తల్లిదండ్రుల వంటి పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలని ఆకాక్షించారు. హ‌త్య విష‌యం తెలియ‌గానే...కేంద్ర విదేశాంగ శాఖా మంతి సుష్మా స్వరాజ్ తో మాట్లాడిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వ పక్షాన ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ, విదేశాంగ శాఖ గళాన్ని, నిరసనను తెలపాలని అన్నారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వక పోయినా.. సరే భారత్ కు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారని, కానీ ఉన్మాద ధోరణి సమర్థ‌నియం కాదని స్ప‌ష్టం చేశారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి సుష్మాస్వరాజ్ ను కలుస్తానని చెప్పారు. భవిష్యత్ లో ఎవరికీ ఇలా జరగొద్ద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

తాను 8 ఏళ్ళు అక్కడ ఉన్నాన‌ని చెప్పిన మంత్రి కేటీఆర్ ఇదివరకు.. ఇపుడు ఉన్న అమెరికా వేరని వ్యాఖ్యానించారు.భయానక వాతావరణం స‌రికాద‌ని ఇలా చేయటం ట్రెండ్ మాదిరిగా అవుతుంద‌ని, అలా అవటం మంచిది కాదని పేర్కొన్నారు. అమెరికాలో లో ఉన్న భారతీయులు ఎవరి జాగ్రత్తలో వారు ఉంటే మంచిదని మంత్రి కేటీఆర్ సూచించారు. త్వరలో పాజిటివ్ వాతావరణం ఏర్పదుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటన లో గాయపడ్డ ఆలోక్ రెడ్డి కుటుంభ సభ్యులతో కూడా మాట్లాడామ‌ని, వాళ్లకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/