Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ పాల‌న‌పై కేటీఆర్ డ‌ప్పు బాగుందే!

By:  Tupaki Desk   |   16 Aug 2017 9:55 AM GMT
టీఆర్ ఎస్‌ పాల‌న‌పై కేటీఆర్ డ‌ప్పు బాగుందే!
X
ఎవ‌రికి పాల‌న వాళ్ల‌కి బాగుటుంది! ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం - పాల‌న గురించి ఆ రాష్ట్ర ఐటీ మంత్రి - సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ గొప్ప‌గా చెప్పుకొచ్చారు. దేశంలో త‌మ‌లాంటి ప్ర‌భుత్వం లేద‌ని తీర్మానించేసినంత ప‌నిచేశారు. పేద‌ల‌కు తాము రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నామ‌న్నారు. అదేస‌మ‌యంలో గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు కురిపించేశారు. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే.. త‌మ‌ ప్ర‌భుత్వం పేద‌ల ఇళ్ల నిర్మాణానికి రూ. 18 వేల కోట్లు ఖ‌ర్చుపెడుతోందని చెప్పారు. ఇంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి క‌ట్టే ఒక్కో ఇల్లు - అప్ప‌టి ప్రభుత్వం నిర్మిస్తామ‌ని చెప్పిన 8 ఇందిర‌మ్మ ఇళ్ల‌తో స‌మాన‌మ‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌ లోని కొంప‌ల్లిలో మిషన్ భ‌గీరథ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్‌.. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చాక జ‌ల‌మండ‌లి ముందు ధ‌ర్నా చేసేవారు క‌నిపించ‌డం లేద‌ని, హైద్రాబాద్ న‌గ‌ర‌వాసుల దాహార్తిని తీర్చ‌డానికి గత పాల‌కులు ఒక్క‌సారి కూడా ఆలోచించ‌లేద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. అలాగే న‌గ‌ర‌వాసుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న తాగునీటి సౌక‌ర్యాల‌ను - అందుకు సంబంధించిన అభివృద్ధి ప‌థ‌కాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

హైద్రాబాద్ కోసం ప్ర‌త్యేకంగా జ‌ల స‌దుపాయం క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల విజ‌యాల గురించి ఆయ‌న కొనియాడారు. అయితే, విప‌క్షాలు ఊరుకుంటాయా? మంత్రి కేటీఆర్ త‌మ పాల‌న గురించి డ‌ప్పుకొట్టుకోవ‌డం ఆయ‌న‌కు బాగానే ఉన్నా.. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతి గురించి - భూబ‌కాసురుల గురించి, రైతు ఆత్మ‌హ‌త్య‌ల గురించి, జ‌ల‌య‌జ్ఞం పేరుతో సాగిస్తున్న క‌మీష‌న్ల య‌జ్ఞం గురించి, ఖ‌మ్మం మిర్చియార్డు ఘ‌ట‌న‌ - నేరెళ్ల పోలీసులు దాష్టీకం - నిరుద్యోగం.. వంటి వాటిపైనా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది క‌దా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అదేస‌మ‌యంలో బంగారు తెలంగాణ ల‌క్ష్యం ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిందో కూడా చెప్పాల‌ని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉందో లేదో కూడా చెప్పాల‌ని అన్నారు. న‌యీం కేసు ఏమైందో వివ‌రిస్తే బాగుండేద‌ని, అప్ప‌ట్లో ఈ కేసు వెనుక ఎంతటి వాళ్లున్నా విడిచిపెట్టేదిలేద‌న్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి కేటీఆర్ వీటికి స‌మాధానం చెబుతారా? లేదా? రాష్ట్రంలో విప‌క్షాల‌కు ప‌నిలేక ఇలా అంటున్నారు అంటారా?! చూడాలి.