Begin typing your search above and press return to search.

కేటీఆర్ తెరదించాడు.. నో ప్రాబ్లం

By:  Tupaki Desk   |   16 Dec 2018 5:22 AM GMT
కేటీఆర్ తెరదించాడు.. నో ప్రాబ్లం
X
తెలంగాణ భావి సీఎంగా కేటీఆర్ పేరు మారుమోగుతోంది. పత్రికల్లో ప్రకటనలు హోరెత్తుతున్నాయి. హరీష్ రావు సైలెంట్ అయ్యాడన్న వార్తలు వెలువడుతున్నాయి. నిన్న కేసీఆర్ నిర్వహించిన ప్రాజెక్టులపై సమీక్షలో హరీష్ రావు పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ ను సీఎం చేయడానికే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం జరిగింది.. కానీ స్వయంగా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు.

బావ హరీష్ తో పాటు టీఆర్ ఎస్ కేడర్ లో నెలకొన్న స్తబ్ధతను కేటీఆర్ ఒక్క ప్రకటనతో రూపుమాపారు. 15 ఏళ్లు సీఎంగా కేసీఆరే కొనసాగుతారని తేల్చిచెప్పారు. పార్టీలో.. ప్రజల్లో అందరి కోరికా కేసీఆర్ సీఎం కావాలని తాజాగా స్పష్టం చేశారు.

నిజానికి కేసీఆర్ పై జనంలో ఓ మంచి అభిప్రాయం ఉంది. ఓ ఉద్యమ నాయకుడిగా ఆయన క్రేజ్ వెలకట్టలేనిది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు - రాహుల్ - కాంగ్రెస్ సహా ఎంతో మంది వచ్చినా అందరూ కేసీఆర్ నే నమ్మారు. కానీ ఇప్పుడు ఆయన వారసత్వం ప్రతిపాదన తీసుకొచ్చారు. అఖండ విజయం సాధించడంతో ఇదే సమయమని భావించారు. అయితే కేసీఆర్ ను ఓన్ చేసుకున్న జనాలకు కేటీఆర్ ను మెల్లిగా ఓన్ చేసుకుంటారు. అందుకే కేసీఆర్ ముందుగా పార్టీ పగ్గాలు తన కుమారుడికి ఇచ్చేశారు. కానీ హరీష్ రావు పై ఈ సమయంలో సానుభూతి వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. 15 ఏళ్లు కేసీఆర్ సీఎం అని స్పష్టం చేశారు. దీంతో అటు టీఆర్ ఎస్ శ్రేణులు - ఇటు అసమ్మతి వాదులు చల్లారారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.