Begin typing your search above and press return to search.

భీమవరంలో కేటీఆర్ ఫాన్స్..

By:  Tupaki Desk   |   25 July 2016 4:10 AM GMT
భీమవరంలో కేటీఆర్ ఫాన్స్..
X
తెలంగాణ ఐటీ మంత్రి - ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా తెలంగాణ మొత్తం అభిమానులు - కార్యకర్తలు - పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన హోర్డింగులు - బ్యానర్లతో నిండిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో కేటీఆర్ బర్త్ డే కు ఫ్లకెస్ లు పెట్టడం చాలా చిన్నవిషయం అని అనుకుంటే... ఇప్పుడు చెప్పబోయే విషయం కచ్చితంగా సర్వసాధారణమైన విషయం కాదనే చెప్పాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రనేతలపై కేటీఆర్ పదదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇదే క్రమంలో గత జీ.హెచ్.ఎం.సీ. ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రజలపై ఆయన చూపించిన ప్రేమపూర్వక మాటలు కూడా తెలిసినవే.. అయితే ఈ క్రమంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - పశ్చిమగోదావరి జిల్లా - భీమవరంలో కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగులు వెలిశాయి. ప్రతుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది.

గతంలో ఒక సందర్హంగా తెరాస ను విస్తరించే క్రమంలో.. ఏపీలో కూడా పార్టీ కార్యక్రమాలు ఉండాలని, అవసరమైతే తాను భీమవరం నుంచి పోటీచేస్తానని కేటీఆర్ ప్రస్థావించిన విషయాన్ని అక్కడి ప్రజలు సీరియస్ గా తీసుకున్నారా... ఏమో కానీ.. తాజాగా వెలిసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం హాట్ టాపిక్ అనే చెప్పాలి!!