Begin typing your search above and press return to search.

ఆధునిక బ‌డిపై కేటీఆర్ ఫొటో చూశారా!

By:  Tupaki Desk   |   21 Jan 2017 8:40 AM GMT
ఆధునిక బ‌డిపై కేటీఆర్ ఫొటో చూశారా!
X
నిండా మూడేళ్లు నిండ‌ని పిల్ల‌లు కూడా బ‌డికి ప‌రుగులెత్తుతున్న కాల‌మిది. ఈ కాలానికి పేరేం పెట్టుకున్నా... ఈ కాలంలో ఎందుకు పుట్టాంరా బాబూ అని పిల్ల‌లు మ‌ద‌న‌ప‌డే రోజులివి. క‌నీసం టిఫిన్ క్యారేజీ కూడా మోయ‌లేని వ‌య‌సులో మోయ‌లేనంత బ‌రువున్న పుస్త‌కాల సంచీని భుజానికేసుకుని నిద్ర కళ్ల‌తోనే బ‌స్సుక్కుతున్న పసి హృద‌యాలు నిత్యం మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇటీవ‌లే త‌న కూతురు చ‌దువుతున్న స్కూల్‌ కు వెళ్లిన టీఆర్ ఎస్ యువ‌నేత‌ - తెలంగాణ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్‌... త‌న కూతురు ఫెర్‌ ఫార్మెన్స్‌పై సంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. అయితే ఈ బ‌డిలో కేటీఆర్‌ కు ఏం క‌నిపించిందో తెలియ‌దు కాని... ఆధునిక విద్యా వ్య‌వ‌స్థ‌పై నేటి ఉద‌యం ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో జ‌నాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌నే చెప్పాలి.

పొద్దు పొద్దున్నే అన్ని స్కూళ్ల‌ల్లో ప్రేయ‌ర్లంటూ 8 గంట‌లు కాక‌ముందే హ‌డావిడి మొద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌హా ప్రేయ‌ర్ల‌కు హాజ‌రు కాకుంటే... ఆ రోజు క్లాసుల‌ను వ‌దులుకోక త‌ప్ప‌దు. దీంతో త‌ల్లిదండ్రుల హడావిడితో పిల్ల‌లు నిద్ర మ‌త్తులోనే స్నానాదికాలు ముగించుకుని స్కూలుకు ప‌రుగులు పెడుతున్నారు. ఇక స‌ద‌రు ప్రేయ‌ర్ల‌లోనూ నిద్దురోతూనే నిలుచుంటున్నారు. కేటీఆర్ షేర్ చేసిన ఫొటో అయితే... మ‌రింతగా మ‌న‌సుల‌ను మెలిపెట్టేలానే ఉంది. నిద్ర మ‌త్తులోనే ప్రేయ‌ర్లో నిలుచున్న ఓ చిన్నారి... త‌న జేబులో స‌గం తినేసిన రోటీని పెట్టుకుని నిల‌బ‌డింది. ఆ చిన్నారి ప‌క్క‌నే ఉన్న మ‌రో పిల్లాడు... ఆ చిన్నారి ప‌డుతున్న ఇబ్బందిని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాడు.

నిజంగా కేటీఆర్ షేర్ చేసిన ఈ చిత్రం విద్యా వ్య‌వ‌స్థ‌లో రావాల్సిన మార్పుల‌పై త‌ల్లిదండ్రుల‌నే కాకుండా స‌గ‌టు జీవిని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌నే చెప్పాలి. ఐదో త‌ర‌గ‌తి లోపు పిల్ల‌ల పాఠ‌శాల‌ల వేళ‌ల‌ను మార్చాలంటూ ఉద్య‌మిస్తున్న విద్యావేత్త‌ల‌కు కేటీఆర్ షేర్ చేసిన ఫొటో బూస్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఐదో త‌ర‌గ‌తి లోపు పిల్ల‌ల‌కు పాఠ‌శాల వేళ‌ల కుదింపుతో పాటు సిల‌బ‌స్‌ ను కూడా స‌మూలంగా మార్చాల‌న్న ఆందోళ‌న‌లు చాలా కాలం నుంచే జ‌రుగుతున్నాయి. ఈ త‌ర‌హా వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికిన క్ర‌మంలోనే కేటీఆర్ స‌ద‌రు ఫొటోను షేర్ చేశారు. అంతేకాకుండా... ఆ ఆందోళ‌న‌ల‌కు తాను కూడా మ‌ద్ద‌తు ప‌లుకున్న‌ట్లుగా ఆయ‌న కొన్ని కామెంట్లు కూడా చేశారు. *పిల్ల‌లు బాల్యాన్ని ఆస్వాదించాలి. అంతేకాని ప్రెష‌ర్ కుక్క‌ర్‌ లో వేసిన‌ట్లుండే... ఈ ఆధునిక విద్యా వ్య‌వ‌స్థ ఏమిటి?* ఆయ‌న ఆ ఫొటోకు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్‌ను జ‌త చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/