Begin typing your search above and press return to search.

మోడీ హ‌వా మ‌న‌ద‌గ్గ‌ర ఉండ‌దంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   27 May 2017 4:43 PM GMT
మోడీ హ‌వా మ‌న‌ద‌గ్గ‌ర ఉండ‌దంటున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌ అధ్యక్షతన నిర్వహించిన‌ టీఆర్‌ ఎస్ పార్లమెంటరీ పార్టీ - శాసనసభాపక్ష సమావేశంలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మంత్రులు హాజరయిన ఈ స‌మావేశంలో పార్టీ సభ్యత్వాలు - పార్టీ కమిటీలపై సమగ్ర చర్చ - సుమాలోచన - రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. జూన్ రెండు నుంచి నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన ఉత్సవాలు - అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.

టీఆర్‌ ఎస్‌ ఎల్పీ సమావేశంలో రాజ‌కీయాల గురించి కేసీఆర్ ప్ర‌త్యేక విశ్లేష‌ణ చేసిన‌ట్లు స‌మాచారం. రాబోయే రోజుల్లో ప్రధాని మోడీ హవా ఉండదని సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా స‌మాచారం. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డం - పది రోజులకోసారి ఎమ్మెల్యేలు - ఎంపీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌న్నారు. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నరేంద్ర మోడీ హవా అడ్డుకోవచ్చని కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. కాగా, రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ లో ఆరు స్థానాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో టీఆర్‌ ఎస్సే గెలుస్తుందని కేసీఆర్‌ చేసిన సర్వే ద్వారా తెలిపారు. హైదరాబాద్‌ లో ఎంఐఎంకు 6, మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ కు 2 సీట్లు వస్తాయని, మిగిలిన స్థానాలన్నింటిలో టీఆర్‌ ఎస్‌ దే విజయమని కేసీఆర్‌ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ ఎస్‌ క్లీన్‌ స్వీప్‌.. ఖమ్మంజిల్లాలో మధిర మినహా - మహబూబ్‌ నగర్‌ లో కల్వకుర్తి మినహా, మిగతా అన్ని స్థానాల్లో టీఆర్‌ ఎస్‌ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

కాగా, టీఆర్‌ ఎస్‌ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్ట్‌ ఇచ్చారు. నివేదికలో కేసీఆర్‌ కు 98 శాతం, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌ కు 91 శాతం, మేన‌ల్లుడు హరీష్‌ రావుకు 88 శాతం మార్కులు వచ్చినట్లు స‌మాచారం. కష్టపడితే గెలుపు టీఆర్‌ ఎస్‌ దేనని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండని ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కోరిన‌ట్లు తెలుస్తోంది. జులైలో నియోజకవర్గాల పునర్‌ విభజన ప్రక్రియ ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. కాగా, అలాగే రాష్ట్రపతి ఎన్నికల నిర్ణయాన్ని పార్టీ నేతలు అధ్యక్షుడికే వదిలేస్తూ టీఆర్ ఎస్ శ్రేణులు నిర్ణ‌యం తీసుకున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/