Begin typing your search above and press return to search.

నాన్న మాటను గుర్తు చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:48 AM GMT
నాన్న మాటను గుర్తు చేసిన కేసీఆర్
X
అయితే రెండు విమర్శలు.. లేదంటే నాలుగు ఆరోపణలు చేసే పేరున్న మంత్రి కేటీఆర్.. తన వైఖరికి భిన్నమైన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించి సానుకూల వ్యాఖ్యలు పెద్దగా చేసింది లేదు. వీలైనంతవరకు తాము చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకోవటం.. తమ మీద విమర్శలు వచ్చే అంశాలపై ఉమ్మడి రాష్ట్రా పాలనపై ధ్వజమెత్తుతూ.. ఆంధ్రా సర్కారు అంటే ఆడిపోసుకోవటం కనిపిస్తుంది.

అయితే.. ఇందుకు భిన్నమైన వ్యాఖ్యల్ని సోమవారం చేయటం గమనార్హం. హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు టీఆర్ ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పిన ఆయన.. ఆంధ్రాలో ఓడరేవులు.. విమానాశ్రయాలు వంటివి వస్తున్నాయని.. కొత్త రాజధాని పేరుతో అభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పిన మాటను ఆయన ప్రస్తావిస్తూ.. ‘‘రెండు తెలుగు రాష్ట్రాలు నేడు అంబానీ సోదరుల్లా అభివృద్ధి జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీని కోరుకుంటున్నాం. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ లో ప్రాంతేతరులపై దాడులు జరుగుతాయని దుఫ్ర్పచారం చేశారు. కానీ.. 15 నెలల్లో ఏన్నడూ ఎవరికి ఇబ్బంది కలగలేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

మరి.. కేటీఆర్ చెప్పినట్లు అంబానీ సోదరుల్లా రెండు రాష్ట్రాలు ఎదుగుతున్నాయని చెప్పటం బాగున్నా.. మరి.. వ్యాపార అవసరాల కోసం అంబానీ సోదరులు ఇప్పుడు చేతులు కలిపారు. మరి.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చేతులు కలిపే పరిస్థితి ఉంటుందా? ఈ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతారా?