Begin typing your search above and press return to search.

నాకు మంత్రి ప‌ద‌వే ఎక్కువ-కేటీఆర్‌

By:  Tupaki Desk   |   15 Nov 2018 11:25 AM GMT
నాకు మంత్రి ప‌ద‌వే ఎక్కువ-కేటీఆర్‌
X
తెలంగాణ ఉద్య‌మం కొత్త రాష్ట్రాన్ని మాత్ర‌మే తేలేదు. మీడియా కొత్త హీరోల‌ను తెచ్చింది. ఆ హీరోలెవ‌రో కాదు కేసీఆర్‌ - కేటీఆర్. మీడియాను నోరు మూయించ‌డంలో వారికి తిరుగులేదు. ఇక్క‌డ దాడిచేస్తార‌ని కాదు... మీడియా మైండ్ల‌కు అంద‌ని స‌మాధానాల‌తో వారి మైండ్‌ ను బ్లాక్ చేస్తారు. ఈరోజు కేటీఆర్ మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మం పెట్టారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల‌తో కేటీఆర్ ముఖాముఖి జ‌రిపారు. అందులోని హైలెట్లు కొన్ని.

* కారు ఆగవద్దు... డ్రైవర్‌ మారొద్దు... !

* రాస్కోండి... మ‌ళ్లీ టీఆర్ ఎస్ స్వంత మెజారిటీతో గెలుస్తుంది.

* టీఆర్‌ ఎస్‌ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను.

* తెలంగాణాలో ప్రభుత్వాన్ని నడిపే సమర్ధ నాయకుడు లేరన్నారు. ఆ మాటలు తప్పని కేసీఆర్‌ నిరూపించారు.

* కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీయే స్వయంగా కేసీఆర్‌ దేశంలో ప్రత్యేక ముద్ర వేశార‌ని అన్నారు.

* దేశంలో దాదాపు 16 రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. అది టీఆర్‌ ఎస్ ప‌రిపాల‌న ఘ‌న‌త‌.

* బాబుది కంప్యూట‌ర్ క‌నిపెట్టే రేంజ్‌. హైకోర్టు భ‌వ‌నాన్ని కట్టించిన చ‌రిత్ర‌... ఆ మాట‌లు నేను అన‌కూడ‌దు.

* టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రుడిలాగే స్వ‌యంప్ర‌కాశితుడు కాదు. పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఒక్క వైసీపీతో మాత్రమే ఆయ‌న‌ పొత్తు పెట్టుకోలేదు. భ‌విష్య‌త్తులో దానికి రెడీ అంటాడు.

* రాష్ట్రంలో ప‌రిపాల‌న ప్ర‌జ‌ల ముంగిట్లో ఉంటే... ప్ర‌జాద‌ర్బార్‌ ల అవ‌స‌రం ఎందుకు. గ‌త ముఖ్య‌మంత్రుల‌కు చేత కాలేదు కాబ‌ట్టి పించ‌ను కోసం కూడా ముఖ్య‌మంత్రిని క‌లిసేవారు. ఇపుడు ఆ క‌ష్టం లేదు. ఆ ద‌ర్బార్‌లు లేవు.

* నాకు మంత్రి ప‌ద‌వే ఎక్కువ‌. దీన్నే జీవితంలో ఊహించ‌లేదు.