Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం డ్యాం ప‌గిలిపోతుందా..!?

By:  Tupaki Desk   |   27 Sep 2016 10:17 AM GMT
పోల‌వ‌రం డ్యాం ప‌గిలిపోతుందా..!?
X
భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ బ‌హుళార్ధ‌సాథ‌క ప్రాజెక్టుల్లో ఒక‌టి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ఏపీ ప్ర‌జ‌లు కోట్లాది క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాలుగా ఈ ప్రాజెక్టు క‌ల సాకారం అవుతుంద‌ని ఎంతో ఆశ‌తో ఉన్నారు. తాజాగా కేంద్రం పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్య‌త త‌మ‌దే అని చెప్ప‌డంతో వారంతో సంతోషంతో ఉన్నారు. అయితే తాజాగా వారి ఆశ‌ల‌కు ఇప్పుడు ఓ పిడుగు లాంటి వార్త బ్రేక్ వేస్తోంది.

పోల‌వ‌రం డ్యాంను ఎంత ప‌టిష్టంగా క‌ట్టినా ఆ డ్యాం పేలిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌ముఖ జ‌ల‌వ‌న‌రుల నిపుణుడు - పద్మభూషణ్ డాక్టర్ కె.ఎల్.రావు గతంలోనే హెచ్చరించార‌ని తెలుస్తోంది. ఇదే అంశంలో ఆయ‌న 30 సంవ‌త్స‌రాల క్రితం 1983 ఏప్రిల్ 30న విజయవాడలో రెండు దిన‌ప‌త్రికల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం డ్యాం డిజైన్‌ లో చాలా లోపాలు ఉన్నాయ‌ని... గోదావ‌రి బేసిన్‌ లో నీటిని కృష్ణా బేసిన్‌ కు మ‌ళ్లీంచే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ఆయ‌న అప్ప‌టి విద్యుత్‌ - నీటిపారుద శాఖా మంత్రుల‌కు చెప్పిన‌ట్టు కూడా ఈ ఇంట‌ర్వ్యూలో ఉంది.

40 ల‌క్ష‌ల వ‌ర‌ద ప్ర‌వాహాన్ని త‌ట్టుకునేందుకు ఇక్క‌డ 1800 అడుగుల స్పిల్ వే ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ వేశార‌ని..అయితే ఆ స్థాయిలో వ‌చ్చే వ‌ర‌ద‌ను త‌ట్టుకోవాలంటే 13 వేల అడుగుల స్పిల్ వే అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇందుకు ప్ర‌కాశం బ్యారేజ్ డిజైన్‌ ను సైతం ఆయ‌న ఉద‌హ‌రించారు. ప్ర‌కాశం బ్యారేజ్‌ కు 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద ఉండ‌క‌పోయినా ఈ బ్యారేజ్ స్పిల్ వే ను 6280 అడుగుల‌తో డిజైన్ చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. డ్యాంపై నుంచి 49 వేల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు 46 గంట‌ల‌కు పైగా డ్యాంపై నుంచి ప్ర‌వ‌హిస్తే అది కూలిపోవ‌డం ఖాయ‌మ‌ని మాజీ ఇంజ‌నీర్ టి.హ‌నుమంత‌రావు త‌న ఆర్టిక‌ల్‌ లో రాసుకొచ్చారు.

ఇక జ‌ల‌వ‌న‌రుల నిపుణులు చెపుతున్న దాని ప్ర‌కారం పోల‌వ‌రం రిజ‌ర్వాయ‌ర్ నీటి నిల్వ సామ‌ర్థ్యం 200 టీఎంసీలు అని - స్పిల్ వే డిశ్చార్జ్ 0.1 మిలియ‌న్ క్యూసెక్కులుగా ఉంది. అయితే ప్ర‌స్తుతం రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యం 300 టీఎంసీల‌కు మించి ఉంది. ఈ లెక్క‌న చూస్తే కొత్త విధానాల‌కు అనుగుణంగా పోల‌వ‌రం డ్యాంకు అనుగుణంగా మ‌రో కొత్త డిజైన్ చేయాల్సిన‌ట్టే క‌నిపిస్తోంది. లేని ప‌క్షంలో కేఎల్‌.రావుతో పాటు పలువురు జ‌ల వ‌న‌రుల నిపుణులు చెప్పేదాని ప్ర‌కారం డ్యాం కూలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/