Begin typing your search above and press return to search.

కేఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు : భూసేక‌ణ‌కు నో

By:  Tupaki Desk   |   27 Aug 2015 9:01 AM GMT
కేఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు : భూసేక‌ణ‌కు నో
X
డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి మ‌రోసారి సంచ‌ల‌నానికి తెర‌లేపారు. కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌కు మంత్రిగా ఉన్నా చంద్ర‌బాబు రాజ‌ధాని క‌మిటీలో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టారు. దీంతో పాటు ప‌లు అంశాల్లో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విబేధాలు ఉన్నాయి. కేఈ కూడా ప‌లుమార్లు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను బ‌హిరంగ వేదిక‌ల మీదే త‌ప్పుబ‌డుతూ వ‌స్తున్నారు.

తాజాగా కేఈ మాట్లాడుతూ రాజ‌ధాని పేరిట భూసేక‌ర‌ణ‌కు తాను వ్య‌తిరేకం అని, ఐతే.. పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయణ ప‌రిధిలోఈ అంశం ఉంది కనుక తానేం మాట్లాడ‌లేనని చెప్పారు.ఇప్ప‌టికే రాజ‌ధాని నిర్మాణం కోసం చాలా భూములు తీసుకున్నార‌ని, ఇంకా భూ సేక‌ర‌ణ అవ‌స‌రం లేద‌ని అన్నారాయ‌న‌.గ్రామాకంఠాలు రైతుల వినియోగంలో వారికే ఇచ్చేయాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌ధానిలో భూ సేక‌ర‌ణ‌కు త‌మ శాఖ‌కూ ఎటువంటి సంబంధ‌మూ లేద‌ని అన్నారు.వాస్త‌వానికి భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను రెవెన్యూ శాఖ చేప‌ట్టాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా నారాయ‌ణే అంతా తానై న‌డిపిస్తుండ‌డం విశేషం. ఈ విష‌యంలో చంద్ర‌బాబు త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో ఆ కోపాన్నంతా కేఈ ఇలా తీర్చుకుంటున్నారు.

ఇక విప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న ధ‌ర్నాల‌ను చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని...జ‌గ‌న్ ఎందుకు ధ‌ర్నా చేశారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని కేఈ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మ‌ని, ఒక్క రాయ‌ల‌సీమ‌కే రూ.ల‌క్ష కోట్ల ప్యాకేజీ అవ‌స‌ర‌మ‌ని కేఈ చెప్పారు.