Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి తప్పులా?

By:  Tupaki Desk   |   30 Aug 2016 7:45 AM GMT
కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి తప్పులా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాటలు ఏవైనా నిజాలుగానే అనిపిస్తాయి. ఆయన మాటలకున్న మహత్యం ఏమిటంటే.. తాను చెప్పే విషయం మీద ఎదుటి వారిని కన్వీన్స్ చేసే శక్తి ఉంటుంది. ఆయన్ను విభేదించే వారు సైతం.. ఆయన చెప్పే మాటలకు దాదాపుగా అవును కదా? అనే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ.. బలంగా కేసీఆర్ మాటల్ని కాదనే వారు కొందరు ఉంటారు. అయితే.. వారి మాటల్లో కేసీఆర్ వాదనను తిప్పి కొట్టే సత్తా కనిపించదు. అలాంటి కేసీఆర్ నోటి నుంచి నుంచి తప్పులు రావటం అనేది ఉంటుందా? అంటే ఉండదనే చెబుతారు.

తాజాగా.. జీఎస్టీ బిల్లుకు ఆమోదం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా కొలువు తీరింది. ఈ సందర్భంగా తొలుత మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట వచ్చిన ప్రారంభ వ్యాక్యాల్లో తప్పులు దొర్లటం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండటం గమనార్హం. సాధారణంగా కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో అర్థం ఉంటుంది. తప్పు అనేది దొర్లటం అన్నది అస్సలు ఉండదు. తీవ్రమైన భావోద్వేగంలో సైతం ఆయన నోటి నుంచి వచ్చే మాటలో పొల్లు తేడా రాదు. అలాంటి కేసీఆర్ నోటి నుంచి తప్పులు రావటం.. అందులో ఒక మాట తప్పు అయితే.. మరోమాటలో సాంకేతికంగా తప్పు దొర్లటం కనిపిస్తుంది.

జీఎస్టీ బిల్లు గురించి మాట్లాడిన ఆయన.. తనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆరేడు రాష్ట్రాల్లో జీఎస్టీ బిల్లు పార్టీలకు అతీతంగా ఆమోదం పొందిందని చెప్పారు. ప్రతి విషయాన్న నిక్కచ్చిగా చెప్పే కేసీఆర్ లాంటి నేత నోటి నుంచి వచ్చిన ఈ మాట కాస్త ఆశ్చర్యానికి గురి చేసేదే. ఎందుకంటే.. జీఎస్టీ బిల్లును ఎన్ని రాష్ట్రాలు ఆమోదించిందన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి అంశం మీద తనకున్న సమాచారం అంటూ చెప్పిన తీరు కాస్త కొత్తగా అనిపించక మానదు. దీన్నీ ఒక విషయంగా ప్రస్తావించాలా? అని ప్రశ్నించే వారు ఉంటారు. ఇలాంటి చిన్న తప్పులు దొర్లకుండా ఉంటాయా? అని కూడా అడగొచ్చు. కానీ.. అక్కడ మాట్లాడింది కేసీఆర్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే.. జీఎస్టీ బిల్లును అన్ని రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుందన్న మాటను కేసీఆర్ చెప్పేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లును.. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల ఆమోదం పొందితే.. ఇది చట్టంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. అన్ని రాష్ట్రాలు దీన్ని ఆమోదించిన తర్వాతే చట్టం అవుతుందన్నట్లుగా కేసీఆర్ మాట్లాడటం ఒక తప్పుగా కనిపిస్తుంది. తాను మాట్లాడే ప్రతి విషయంపైనా పట్టు సంపాదించిన తర్వాతే మాట్లాడతారన్న పేరున్న కేసీఆర్ లాంటి నేత నోటి నుంచి ఇలాంటి తప్పులు దొర్లటం కాస్త చిత్రమైన అంశంగా చెప్పక తప్పదు.