కేసీఆర్ సాహసం వృథాపోలేదు..రెండో సారి సీఎం పీఠంపై

Tue Dec 11 2018 21:43:56 GMT+0530 (IST)

టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వేసిన లెక్కలు ఫలించాయి. దేశంలోనే కాదు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన పార్టీగా టీఆర్ ఎస్ చరిత్ర తిరగరాసింది. రాష్ట్రం ఏర్పాటుతోపాటు తొలి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పదవీ కాలంతో పూర్తి మెజార్టీ ఉన్నా.. 8 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లాడు. ఇది సాహసమే. ఫస్ట్ టైం.. 8 నెలల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన పార్టీగా టీఆర్ ఎస్ చరిత్ర సృష్టించింది. రెండో దఫా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.కేసీఆర్ సాహసం ఊరికేపోలేదనేందుకు పలు ఉదాహరణలున్నాయంటున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ముందస్తుకి వెళ్లిన పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 2003లో తన ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని వాజ్ పేయి ప్రభుత్వాన్ని ముందస్తు ఎన్నికలకు తీసుకెళ్లి ఓడిపోయారు చంద్రబాబు. అదే విధంగా 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. ఎన్టీఆర్ హవా తగ్గించటం కోసం ముందస్తుకి వెళ్లారు అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర రెడ్డి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలుపొందారు. కోట్ల ఓడిపోయారు. ఇతర రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సందర్భాల్లో అధికార పార్టీకి భంగపాటు తప్పలేదు.

కాగా రెండో దఫా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నాయి. డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న విడుదలయ్యాయి. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ ఎస్...ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమౌతోంది. ముహూర్తాలు ఎక్కువగా నమ్మే కేసీఆర్..ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. బుధవారం పంచమి ఉందని...కేసీఆర్ జాతకరీత్యా మంచిది కాదని..దీనితో డిసెంబర్ 12వ తేదీ బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేయాలని పలువురు సూచించినట్లు తెలుస్తోంది. దీనితో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.