Begin typing your search above and press return to search.

మొక్క చేతికి ఇచ్చారంటే కారు ఎక్కిన‌ట్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   14 March 2019 4:42 PM GMT
మొక్క చేతికి ఇచ్చారంటే కారు ఎక్కిన‌ట్లేన‌ట‌!
X
ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ.. విభ‌జ‌న త‌ర్వాత ఎప్పుడూ క‌నిపించ‌ని చిత్ర‌మైన రాజ‌కీయ దృశ్యం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటోంది. ప్ర‌జాస్వామ్యంలో విప‌క్షానికి ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ప్ర‌తిప‌క్షంగా బ‌లంగా ఉన్న‌ప్పుడే ప్ర‌జాస్వామ్య సౌంద‌ర్యం ఏమిటో తెలుస్తుంద‌న్న మాట‌ను చెబుతుంటారు. దీనికి భిన్నంగా ప్ర‌తిప‌క్ష‌మ‌న్న‌దే ఉండ‌ద‌న్న‌ట్లుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

ఈ మ‌ధ్య‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ప‌లువురు విప‌క్ష ఎమ్మెల్యేలు త‌మ‌కు ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. తాము ఎవ‌రిని ర‌మ్మ‌ని అడ‌గ‌టం లేద‌ని.. వారే త‌మ అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు ఆక‌ర్షితులై త‌మ పార్టీలోకి వ‌స్తున్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు.

ఇప్ప‌టికే ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేర‌టం.. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే..మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత స‌బితాఇంద్రారెడ్డి గులాబీ కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకోవ‌టం.. త్వ‌ర‌లో ఆమె గులాబీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధం కావ‌టం తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోక‌ముందే తెలంగాణ కాంగ్రెస్ కు మ‌రో షాక్ త‌గిలింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మీద విజ‌యం సాధించిన పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరేందుకు రెఢీ అయ్యారు.

తాజాగా ఆయ‌న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వివిధ అంశాల మీద చ‌ర్చించిన‌ట్లుగా చెబుతున్న‌ప్ప‌టికి పార్టీ మారే విష‌య‌మై చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఆయ‌న పార్టీ మార‌టం సాంకేతిక అంశంగా చెబుతున్నారు. కావాలంటే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ ఎస్ బీ ఫారం మీద పోటీ చేసి గెలుస్తాన‌ని కేటీఆర్ తో చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ భేటీకి గుర్తుగా చివ‌ర్లో ఆయ‌న చేతికి చిన్న మొక్కతో కూడిన కుండీని కేటీఆర్ ఇచ్చారు. కేటీఆర్ మొక్క‌ను ఇచ్చారంటే.. స‌ద‌రు విప‌క్ష నేత పార్టీలో చేరిన‌ట్లేన‌న్న మాట వినిపిస్తోంది.తాజాగా ఆ విష‌యం మ‌రోసారి రుజువైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. కాంగ్రెస్ నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా గులాబీ గూటికి చేరుకుంటున్న నేత‌లు మ‌రెంద‌రు ఉంటార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.