Begin typing your search above and press return to search.

కేసీఆర్ అనే నేను.. రేపే

By:  Tupaki Desk   |   12 Dec 2018 8:11 AM GMT
కేసీఆర్ అనే నేను.. రేపే
X
తెలంగాణలో గురువారం టీఆర్ ఎస్ నూత‌న ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ రేపు మ‌ధ్యాహ్నం 1:30 నిమిషాల‌కు రాజ్ భ‌వ‌న్‌ లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ మేర‌కు టీఆర్ ఎస్ ముహూర్త ఖ‌రారు చేసుకుంది. కేసీఆర్ తోపాటు కొంత‌మంది మంత్రులు కూడా రేపే ప్ర‌మాణం చేయ‌నున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ ఎస్ ప్ర‌భంజ‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 119 సీట్ల‌కు గాను 88 స్థానాల‌ను ఆ పార్టీ ద‌క్కించుకుంది. కొత్త‌గా ఎన్నికైన ఎమ్మేల్యేలతో టీఆర్ ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం ఈరోజే జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం త‌మ తీర్మాన ప్ర‌తిని గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేయ‌నున్నారు.

త‌న‌తోపాటు మంత్రులుగా ఎవ‌రెవ‌రితో ప్ర‌మాణం చేయించాల‌నే విష‌యంపై కేసీఆర్ ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కేబినెట్ లో ప‌నిచేసిన న‌లుగురు మంత్రులు చందూలాల్‌ - తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు - మ‌హేంద‌ర్ రెడ్డి - జూప‌ల్లి కృష్ణారావు తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. స్పీక‌ర్ మ‌ధుసూధ‌నా చారికి కూడా ఓట‌మి ఎదురైంది. దీంతో వారి స్థానంలో ఎవ‌రిని కేబినెట్ లోకి తీసుకోవాల‌నే విష‌యంపై కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.