Begin typing your search above and press return to search.

చంద్రబాబు డౌన్.. కేసీఆర్ ఫైన్

By:  Tupaki Desk   |   29 March 2017 10:51 AM GMT
చంద్రబాబు డౌన్.. కేసీఆర్ ఫైన్
X
ఇండియన్ ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా చూస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో కేవలం ఆరుగురు తెలుగోళ్లు మాత్రమే ఉన్నారు. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. అందులో అయిదుగురు రాజకీయ నేతలు. ఒకరు న్యాయమూర్తి. ఇక నేతల విషయానికొస్తే ఇద్దరు బీజేపీ, ఒకరు టీడీపీ, ఇంకొకరు టీఆరెస్, ఒకరు ఎంఐఎంకి చెందినవారు.

*జాబితాలోని తెలుగువారిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టాప్ లో ఉన్నారు. ఆయన మొత్తం జాబితా ప్రకారం చూస్తే 21వ స్థానంలో ఉన్నారు. ఆయన లాస్ట్ ఇయర్ లిస్టులో 37వ ప్లేసులో ఉండేవారు.

* ఆ తరువాత బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ 40వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది 70వ స్థానంలో ఉన్న ఆయన ఈసారి ఏకంగా 40వ స్థానానికి ఎగబాకారు.

* వీరిద్దరి తరువాత స్థానం ఏపీ సీఎం చంద్రబాబుది. ఆయన తాజా లిస్టులో 48వ స్థానంలో ఉన్నారు. ఇంతకుముందు 2016 లిస్టులో 44వ స్థానంలో ఉన్నారు.

* ఆ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ 54 వ స్థానం లో ఉన్నారు. ఆయన ఈ జాబితాలోకి రావడం ఇదే ఫస్ట్ టైం.

* ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 58వ స్థానంలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఒక స్థానం మెరుగుపడింది.

* ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ 72వ స్థానంలో ఉన్నారు. ఆయన గత ఏడాది 81వ స్థానంలో ఉండేవారు.

జాబితాను విశ్లేషిస్తే మొత్తం ఆరుగురు తెలుగువారిలోనూ గత ఏడాది కంటే స్థానం దిగజారింది కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే. మిగతావారంతా గతం కంటే బలపడ్డారు. అలాగే తెలంగాణలో రాజకీయంగా ఎంతో బలవంతుడిగా ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయికి వచ్చేసరికి పెద్దగా ప్రభావశీలిగా కనిపించడం లేదు. గతం కంటే ఆయన స్థానం మెరుగైనా కూడా ఈ జాబితాలోని తెలుగు వారందరిలోనూ ఆయనదే లాస్ట్ ప్లేస్. పైగా మెయిన్ స్ట్రీంలో కనిపించని రాంమాధవ్, ఎక్కడా అధికారంలో లేని ఎంఐఎం అధినేత కంటే ఆయన వెనుకంజలోనే ఉన్నారు.