Begin typing your search above and press return to search.

భయం - భక్తితో హరితం చేస్తోన్న కేసీఆర్

By:  Tupaki Desk   |   2 Aug 2018 5:32 AM GMT
భయం - భక్తితో హరితం చేస్తోన్న కేసీఆర్
X
‘భరత్ అనే నేను’ మూవీలో మహేష్ బాబు ఓ భారీ డైలాగ్ ను కొట్టాడు.. అదే ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి ఉండాలని.. అలా ఉంటేనే వ్యవస్థ నడుస్తుందని తెలిపాడు. ఈ విషయాన్ని మహేష్ చెప్పినా, కేసీఆర్ చెప్పినా ఎవ్వరూ వినరు.. ఎందుకంటే వారితో సామాన్యులకు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏమీ ఉండదు.. కానీ పోలీసులు చెబితే వింటారు. వారికున్న విచక్షణ అధికారాలు.. సామాన్య పౌరులకు కూడా దడ పుట్టిస్తుంటాయి.

సమాజంలో పోలీసులకు ఎవ్వరినైనా అరెస్ట్ చేసే హక్కు - విచారించే హక్కు ఉంది. నైజాం కాలాంలో రజకార్ల పేరుతో తెలంగాణను దోచుకున్న ఓ మూక తెలంగాణ ప్రజలపై భీతిగొలిపే భయాన్ని సృష్టించి చెరగని ముద్ర వేసింది. ఇక ఆ తర్వాత నక్సలిజం విస్తరించి తెలంగాణ పల్లెలను ప్రభావితం చేసినప్పుడు కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించి వారిని నిర్మూలించారు.

పోలీసులంటే అనాధిగా ప్రజల్లో ఒకరకమైన భయం, భక్తి ఉంటూ వస్తోంది. ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే సామన్యులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసీంగ్ పేరుతో కాస్త మార్పు తెచ్చాడు. పోలీసులను ప్రజలకు చేరువ చేశాడు.

కానీ సామాన్యులైనా - సెలబ్రెటీలైనా పోలీస్ తలుచుకుంటూ తల వంచాల్సిందే.. ఎంత పెద్ద ప్రముఖులు అయినా సరే పోలీసులతో పెట్టుకోవాలంటే భయపడిపోతారు. అంతటి వజ్రాయుధం లాంటి పోలీస్ వ్యవస్థ రాష్ట్ర శాంతి భద్రతలకు కీలకం అని భావించే కేసీఆర్ వారిని పటిష్టపరుస్తున్నాడు. వాహనాలు - నిధులు - నియమాకాలతో పోలీస్ వ్యవస్థను మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మారుస్తున్నాడు.

తాజాగా పోలీసుల నెత్తిన మరో బృహత్తర బాధ్యతను కేసీఆర్ మోపారు. తెలంగాణకు హరితహారం పేరుతో గడిచిన నాలుగేళ్లుగా మొక్కలు నాటడం.. అవి ఎండిపోవడం లేదా చిగురించకపోవడంతో ఈసారి కేసీఆర్ రూటు మార్చాడు. పచ్చదనం పెంపునకు స్ట్రిక్ట్ గా ఉండే పోలీసుల సేవలను ఉపయోగించుకుంటున్నాడు. పచ్చదనం కోసం హరిత సైన్యాన్ని ఏర్పాటు చేసి పోలీసుల సాయంతో మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఎంత ప్రజాప్రతినిదులు పిలిచినా రాని ప్రజలు యువకులు పోలీసులు పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. అందుకే వారిని ప్రయోగించి హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కేసీఆర్ పూనుకున్నారు. మరి మన పోలీసుల ప్రయత్నాలతోనైనా తెలంగాణ హరిత పందిరి పరుచుకుంటే అంతే చాలు....