Begin typing your search above and press return to search.

కేసీఆర్ రెండో జాబితా ఎప్పుడు..?

By:  Tupaki Desk   |   12 Sep 2018 6:25 AM GMT
కేసీఆర్ రెండో జాబితా ఎప్పుడు..?
X
తెలుగు రాజ‌కీయాల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం లేని అనుభ‌వాన్ని మిగిల్చారు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌. 119 నియోజ‌క‌వ‌ర్గాలున్న రాష్ట్రంలో.. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాకముందే ఏకంగా 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌టం కేసీఆర్‌ కు మాత్ర‌మే సాధ్య‌మైంది.

ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు సొంత పార్టీ నేత‌ల‌కు సైతం షాకిచ్చిన ఈ వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్నిక‌ల విష‌యంలో కేసీఆర్ ఎంత స్ప‌ష్ట‌త‌గా ఉన్నార‌న‌టానికి అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల పెద్ద నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఊహించని విధంగా కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో తొలి జాబితాలో మార్పులు చోటు చేసుకుంటాయా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పెద్ద ఎత్తున కాకున్నా..కొన్ని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో కేసీఆర్ అభ్య‌ర్థుల్ని మార్చే వీలుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా ప్ర‌క‌టించ‌ని 14 స్థానాల‌కు అభ్య‌ర్థుల ఖ‌రారు ఎప్పుడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మ తోటి వారంతా ప్ర‌చారంలో దూసుకెళుతున్న వేళ‌.. 14 స్థానాల‌కు చెందిన ఆశావాహులు ఏం చేయాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

మ‌రోవైపు అధినేత ఫాంహౌస్ లో వ్యూహ‌ర‌చ‌న‌లో మునిగిపోవ‌టంతో.. అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌ని స్థానాల నేత‌ల టెన్ష‌న్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం రెండో జాబితా గురువారం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 105 మందితో పాటు మిగిలిన 14 మంది ప్ర‌చార‌రేసులో దూసుకెళ్లాల‌న్న ఒత్తిడి కేసీఆర్ మీద అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. వినాయ‌క‌చ‌వితి రోజు రెండో జాబితా విడుద‌ల చేసే అవ‌కాశం ఉందా? అన్న మాట వినిపిస్తోంది. ముహుర్తాల్ని.. గ్ర‌హ‌బ‌లాల్ని విప‌రీతంగా న‌మ్మే కేసీఆర్‌.. చ‌వితి వేళ‌.. లిస్ట్ ప్ర‌క‌టించే అవ‌కాశం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొద‌టి జాబితాకు మ‌హుర్తాలు చూసుకోవ‌టం మామూలే కానీ.. ప్ర‌తి జాబితాకు అంత క‌స‌ర‌త్తు ఉంద‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. కేసీఆర్ ఎవ‌రి న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తారో చూడాలి.