Begin typing your search above and press return to search.

కేసీఆర్ సేమ్ ప్లాన్ ఉప‌యోగిస్తున్నారు

By:  Tupaki Desk   |   10 Feb 2016 10:35 AM GMT
కేసీఆర్ సేమ్ ప్లాన్ ఉప‌యోగిస్తున్నారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా మ‌రింత ప‌రిణ‌తి క‌న‌బ‌రుస్తున్నారు. తెలంగాణ‌లో కారు జోరుకు అడ్డు అదుపు లేకుండా చూసుకోవాల‌ని అడుగులు వేస్తున్న కేసీఆర్ ఈ క్ర‌మంలో అన‌వ‌స‌రంగా శ్ర‌మ ప‌డ‌వ‌ద్ద‌ని డిసైడ్ అయ్యారు. పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెడుతూనే వికేంద్రీక‌ర‌ణ సిద్ధాంతాన్ని ఉప‌యోగిస్తున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఇదే థియ‌రీ ఫాలో అవుతూ త‌న కుమారుడు కేటీఆర్‌ కు ప్ర‌చార‌ప‌గ్గాలు అప్ప‌జెప్పిన కేటీఆర్ ఈ క్ర‌మంలో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక విష‌యంలో సేమ్ స్కెచ్‌ ను ఫాలో అవుతున్నారు.

నారాయ‌ణ‌ఖేడ్ ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను పూర్తిగా మంత్రి - మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావుకు అప్ప‌జెప్పిన కేసీఆర్ ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌చారంపై జోక్యం చేసుకోలేదు. అయితే ఒకే బ‌హిరంగ ద్వారా విజ‌యం సాధించాల‌నే టార్గెట్ పెట్టుకొని తాజాగా నారాయణఖేడ్ ప‌ట్ట‌ణంలో ఇవాళ టీఆర్‌ ఎస్ ఎన్నికల బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభకు కేసీఆర్ విచ్చేసి ప్రసంగించనున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల లాగే ప్ర‌చారం గ‌డువు ముగిసేందుకు రెండ్రోజుల ముందు కేసీఆర్ స‌భ ఉండ‌టం విశేషం. ఈ ఒకే బ‌హిరంగ స‌భ‌కే కేసీఆర్ ప్ర‌చారం ప‌రిమితం కానుంది! గ్రేట‌ర్‌ లో వ‌ర్క‌వుట్ అయిన కేసీఆర్ ఫార్ములా నారాయ‌ణ‌ఖేడ్‌ లో కూడా స‌క్సెస్‌ అవుతుందో చూడాలి మ‌రి.

మ‌రోవైపు ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్రలోభాల ప‌ర్వం కొన‌సాగుతోంది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డ‌బ్బు మ‌ధ్యం ప‌ట్టుబ‌డింది. ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో కాంగ్రెస్‌ కు చెందిన రూ.3.24 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. నగదును సీజ్ చేశారు. మ‌రో గ్రామంలోకాంగ్రెస్ నేత నివాసంలో 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.