Begin typing your search above and press return to search.

మోడీతో భేటీ పాజిటివ్.. ఢిల్లీలోనే కేసీఆర్!

By:  Tupaki Desk   |   16 Jun 2018 5:37 AM GMT
మోడీతో భేటీ పాజిటివ్.. ఢిల్లీలోనే కేసీఆర్!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప్ర‌యాణం అంటే అదో పెద్ద కార్య‌క్ర‌మంగా చెబుతారు. అదే ప‌నిగా ఢిల్లీకి వెళ్ల‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. తాను స్వ‌యంగా రంగంలోకి దిగితే.. అందుకు త‌గ్గ‌ట్లు సీన్ ఉండాల‌న్న ఆలోచ‌న‌ను త‌ర‌చూ వ్య‌క్తం చేస్తుంటారు. ఈ కార‌ణంతోనే చాలా కార్య‌క్ర‌మాల‌కు త‌న కొడుకు క‌మ్ మంత్రి కేటీఆర్‌.. మేన‌ల్లుడు హ‌రీశ్ కు అప్ప‌జెబుతుంటారు.

తాజాగా కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌నే చూస్తే.. ఆయ‌న ఏడు నెల‌ల క్రితం దేశ రాజ‌ధానికి వెళ్లారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే ప్ర‌ధానిని క‌ల‌వ‌టం. అదే ప‌నిగా క‌ల‌వ‌టం.. కోర్కెల చిట్టాను ముందు పెట్ట‌టం లాంటివి కేసీఆర్‌కు ఇష్టం ఉండ‌ద‌ని చెబుతారు. అడిగేదేదో.. బ‌లంగా అడ‌గాల‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంద‌ని చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ప్ర‌ధానితో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న తెర మీద‌కు తీసుకొచ్చిన కొర్కెల చిట్టా చూస్తే.. ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది కూడా.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ వెళ్లే కార్య‌క్ర‌మాల్ని చూస్తే.. తాను మాత్ర‌మే వెళ్లాల్సి ఉన్న వాటికి మాత్ర‌మే ఆయ‌న వెళ్లే ధోర‌ణి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ప్ర‌ధాని మోడీతో భేటీ కోసం ఢిల్లీ వ‌చ్చిన ఆయ‌న‌.. భేటీ త‌ర్వాత దేశ రాజ‌ధానిలోనే ఉన్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని భేటీ కానున్న సంగ‌తి తెలిసిందే. నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజ‌ర‌య్యేందుకు కేసీఆర్ ఉండిపోయారు.

నీతిఆయోగ్ మీటింగ్‌ కు ముందే ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన కేసీఆర్‌.. ఒక‌వేళ త‌న భేటీ కానీ ఫ‌ల‌ప్ర‌దం కాకుంటే వెంట‌నే హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు చెబుతారు. అయితే.. మోడీతో మీటింగ్ పాజిటివ్ గా జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న ఢిల్లీలో ఉండిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ సంతృప్తి ప‌డేలా మోడీ ఇచ్చిన మాట సారాంశం వాస్త‌వ‌రూపం ఎప్పుడు దాలుస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.