Begin typing your search above and press return to search.
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. ఫిబ్రవరి 14?
By: Tupaki Desk | 22 Jan 2019 10:39 AM ISTరిటర్న్ గిఫ్ట్.. పలకడానికి రెండు అక్షరాల పదమే కానీ.. దీని ఇంపాక్ట్ రెండు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తానన్న ఈ గిఫ్ట్ ప్రభావం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ను కలిసి చర్చలు జరిపారు. ఆ భేటిలోనే కేసీఆర్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా ట్రైలర్ కే టీడీపీ నేతలు, అధినేత బాబు బట్టలు చింపుకున్నంత పనిచేశారు. ఇక ‘రిటర్న్ గిఫ్ట్’ సినిమాకు తాజాగా కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
కేసీఆర్ స్వయంగా జగన్ ను ఏపీలో కలిసి ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరుపుతారని కేటీఆర్-జగన్ భేటి తర్వాత ఇద్దరూ ప్రకటించిన సంగతి తెలిసిందే.. మరి ఆ భేటి ఎప్పుడు.? ఎక్కడ.? అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తన మకాంను హైదరాబాద్ నుంచి అమరావతికి మారుస్తున్నారు. ఆయన అమరావతిలో తలపెట్టిన సొంత ఇంటి నిర్మాణం ఈ నెలాఖరుతో పూర్తవుతోంది. ఫిబ్రవరి 14న గృహప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఇంటి గృహ ప్రవేశానికే కేసీఆర్ వచ్చి జగన్ తో శీఘ్ర చర్చలు జరుపుతారని వార్తలొస్తున్నాయి.
అయితే అంతకుముందే కేసీఆర్.. జగన్ తో కడప జిల్లాలోని జగన్ వ్యవసాయ క్షేత్రం ఇడుపులపాయను సందర్శించి అక్కడే చర్చలకు మొగ్గుచూపుతున్నారని మరో వాదన వినిపిస్తోంది. ప్రకృతి ప్రేమికుడైన కేసీఆర్ కు ఇడుపులపాయ ను చూపించి అక్కడే చర్చలు చేస్తారని నాయకులు చెబుతున్నారు. ఇలా ఫిబ్రవరి 14 లేదా.. ఈ నెలాఖరులో జగన్ , కేసీఆర్ భేటి ఖాయమని రాజకీయవర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే వీరి భేటిపై ఆందోళనగా ఉన్న టీడీపీ నేతలు.. కలిశాక ఎలాంటి ప్రభావం పడుతుందోనని హడలి చస్తున్నారు.
కేసీఆర్ లాంటి అపరరాజకీయ నాయకుడితో జగన్ భేటి అయనకు ఖచ్చితంగా గొప్పగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ సినిమా ఫిబ్రవరిలోనే అని తేలడంతో టీడీపీ శిబిరంలో ఆందోళన మొదలైందట.. ఆ గిఫ్ట్ ప్రభావం తమ కొంప ముంచుతుందోనని వారంతా భయపడుతున్నట్టు సమాచారం.