చంద్రశేఖరా...వారి దారి గోదారేనా.!.?

Fri Sep 21 2018 17:50:55 GMT+0530 (IST)

తెలంగాణలో ముందస్తుకు నగారా మోగిన సంగతి తెలిసిందే........ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు - తెలంగాణ రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు  ముందస్తు ఎన్నిలకు 105 నియోజక వర్గాలలో ముందుగా  అభ్యర్దులను కూడా ప్రకటించి తన ఘనత చాటుకున్నారు. అయితే కొన్ని నియోజక వర్గాలలో  అభ్యర్దులను మార్చే ఆలోచన తెరాసా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించిన 105 మంది అభ్యర్దుల జాబితాలో 35 మంది అభ్యర్దుల మార్పుపై పునారాలోచలో  ఉన్నట్లు తెలుస్తోంది.  మార్పు చేయాలనుకుంటున్న 35 నియోజక వర్గాలలోని అభ్యర్దులకు వారి పేరున పోస్టర్లు అతికించరాదని - ప్రచారానికి సంబంధించిన ఎటువంటి చర్యలు చేపట్టవద్దని - ప్రచార సాధనాలకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేయవద్దని - అభ్యర్దుల పేర్లుగాని - ఫోటోలు గాని ఎక్కడ అతికంచవద్దంటూ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. మిగిలిన 70 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ 35 నియోజకవర్గాలలో ప్రచారాన్ని ఆపడంపై - ఆ నియోజకవర్గాలలో  అభ్యర్దులను మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలోని  తమ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకున్న కె. చంద్రశేఖర రావు - అభ్యర్దుల మార్పుపై పునారాలోచన ఉన్నట్లు సమాచారం. రాజకీయాలలో సీనియర్ నాయకుడైన ఈటేల రాజేంద్ర కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితుల ద్రుష్ట్య ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ప్రచారం ఆపాలంటూ తనకు వచ్చిన ఆదేశాలు తర్వత - ఆ నియోజకవర్గాలలోని అభ్యర్దులకు ఎలా స్పందించాలో తెలియక తికమక పడుతున్నారు. ముఖ్యమంత్రిని బాహటంగా వ్యతిరికించలేక - తమకు జరగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక - తమ మద్దతుదారులకు సర్దిచెప్పుకో లేక - ఏం చేయాలో పాలుపోవటం లేదని తమ సన్నిహితు దగ్గర వాపోతున్నట్లు సమాచారం.  అయితే ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ముందస్తుకు వెడుతున్నారని - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పైన - ఆయన కుటుంబంపైన ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని - ముందస్తు అయిన వెనకస్తు అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటమి తప్పదని విపక్షాలు గేలి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన జాబితాపై ఆయనకే నమ్మకం లేకపోవడమేమిటని ప్రతిపక్ష నాయకులు కొందరు ఆక్షేపిస్తున్నారు.  ఏదిఏమైనప్పటికి రాబోయే ముందస్తు ఎన్నికలలో కల్వకుంట్ల వారికి ప్రజలు తప్పక బుద్ది చెబుతారని వారంటున్నారు.