Begin typing your search above and press return to search.

వ‌రంగ‌ల్ తీర్పుపై కేసీఆర్ ఏమ‌న్నారంటే...

By:  Tupaki Desk   |   24 Nov 2015 3:38 PM GMT
వ‌రంగ‌ల్ తీర్పుపై కేసీఆర్ ఏమ‌న్నారంటే...
X
వరంగల్ ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌డంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఫలితాలు అధికారికంగా వెలువ‌డిన అనంత‌రం కేసీఆర్ పార్టీ కార్యాల‌య‌మైన‌ తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక అంశాల‌పై స్ప‌ష్టంగా స్పందించారు. ఈ క్ర‌మంలో త‌న‌దైన శైలిలో ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే...అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వెల్ల‌డించారు.

వరంగల్‌ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. వరంగల్‌ ఉప ఎన్నికలో త‌మ‌ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించ‌డంతో త‌మ బాధ్యత మ‌రింత‌ పెరిగిందని చెప్పారు. వరంగల్ జిల్లాలోని అన్ని వర్గాల వారికి కేసీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. ఎవరికీ రాని మెజారిటీని తెరాసకు కట్టబెట్టారని కేసీఆర్ సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షాలు - మీడియాకు ఇంత అసహనం పనికి రాదని మండిప‌డ్డారు. ప్రతిపక్షాలు నీచాతినీచంగా వ్యవహరించాయని... అర్థం పర్ధం లేకుండా మాట్లాడారని అయితే....ప్రజలు వారికి బుద్ధిచెప్పారని చెప్పారు. ప్రజలు వెల్లువలా తెరాసకు మద్దతిచ్చారన్నారు. త‌మ‌కు బతిమిలాడితోనో, బామాలితోనో వచ్చిన ఓట్లు కావివని , వరంగల్‌ ప్రజల తీర్పును శిరోధార్యంగా తీర్చుకుంటామని తెలిపారు.

వ‌రంగ‌ల్‌లో గెలిచినట్టు రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస తప్పకుండా 80 సీట్లు గెలుస్తుందని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. త్వరలో జిల్లాల్లో బస్సు యాత్రను ప్రారంభిస్తానని ప్ర‌క‌టించారు. నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. డిసెంబర్‌ లో తాను నిర్వహించనున్న ఆయత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయం చేసేలా నెలన్నరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. మంత్రులకు స్పెషల్‌ ఫండ్‌కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు.