Begin typing your search above and press return to search.

గులాబీ 'డిజిటల్' గుబాలింపు.. కాంగ్రెస్ నై

By:  Tupaki Desk   |   12 Oct 2018 11:45 AM GMT
గులాబీ డిజిటల్ గుబాలింపు.. కాంగ్రెస్ నై
X
ఎన్నికల పోరుకు అన్ని పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్ష పార్టీ ని చిన్నాభిన్నం చేసేందుకు పథకం రచించుకుంటున్నాయి. మరి ఈ పోరులో గెలుపెవరిది. గెలిచి నిలిచేదెవరిదీ అన్న ఉత్కంఠ తెలంగాణ ఎన్నికల్లో ఉత్కంఠగా మారింది.

తెలంగాణాలో ఎన్నికల పోరు ప్రారంభమైంది. అభివృద్ధే నినాదాంగా అధికార టీఆర్ఎస్ ప్రజల ముందుకు వెళ్తుండగా, వైఫల్యాలే ప్రధాన అంశంగా చూపుతూ ప్రతి పక్షాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ అంటేనే సెంటిమెంట్. ఉద్యమ సమయంలో సెంటిమెంట్ పండింది. టీఆర్ ఎస్ కు బాగానే వర్కవుటయ్యింది. అప్పుడు సమయం అలాంటింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుు ఇప్పడు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు కేసీఆర్. తాజాగా కేసీఆర్ పేరిట ‘నేను.. మీ కేసీఆర్’ అని రూపొందించిన ఓ పది అడ్వటైజ్ మెంట్ వీడియోలను వివిధ న్యూస్ చానెల్స్ - ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ లో ప్రకటనల రూపంలో ఇవ్వడానికి టీఆర్ ఎస్ సిద్ధమైంది. ఇందులో కేసీఆర్ మొదట తనను తాను పరిచయం చేసుకొని గులాబీ పార్టీ ప్రవేశపెట్టి పథకాల జాబితాలను అందులో చూపించనున్నారట.. ఇలా తమ పథకాలు - కేసీఆర్ ను ముందు పెట్టి ప్రజల్లోకి వెళ్లడానికి గులాబీ పార్టీ రెడీ అయ్యింది. ఇలా టీఆర్ ఎస్ డిజిటల్ మీడియాలో కూడా ప్రచారంతో హోరెత్తించేందుకు రెడీ అవుతుండగా.. మహాకూటమి పరిస్థితి మాత్రం మరోలా ఉంది.

టీఆర్ ఎస్ ఓటమే ధ్యేయంగా ఏర్పడంది మహా కూటమి. కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్ - సీపీఐ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు వీరికి సీట్ల సర్దుబాటే ప్రధాన సమస్య. ఇదిలా ఉండగా - కేసీఆర్ అంతటి వ్యక్తిని ఎదుర్కొనేందుకు వీరి దగ్గర అస్త్రాలు ఏం ఉన్నాయన్న ఆలోచన రాకమానదు. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై నిరుద్యో్గులు గుర్రుగా ఉన్నారు. ప్రాజక్టులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చింది లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగినట్లు చెబుతున్నారు కూటమి నేతలు.

ఇలా ఎవరికి వారు కయ్యానికి కాలు దువ్వుతూ రణరంగంలోకి దూకిపోయారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ఆ పార్టీ నేతలను - కార్యకర్తలను ఈ పార్టీలోకి - ఈ పార్టీలోని వాళ్లను ఆ పార్టీకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మానసికంగా కృంగ దీయడానికి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వాడుకుంటూ ఎవరికి వారు హంగామా చేస్తున్నారు. ఈ రసవత్తర పోరులో గెలుపెవరి స్వంతం అవుతుందో వేచి చూడాల్సిందే.