Begin typing your search above and press return to search.

ప‌రిపూర్ణ బ‌హిష్క‌ర‌ణ‌తో కేసీఆర్ సెల్ఫ్ గోల్?

By:  Tupaki Desk   |   19 July 2018 6:08 PM GMT
ప‌రిపూర్ణ బ‌హిష్క‌ర‌ణ‌తో కేసీఆర్ సెల్ఫ్ గోల్?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయాల్లో ఆరితేరిన వ్యూహ‌క‌ర్త అనే సంగతి తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా... దాన్ని అవ‌కాశంగా త‌న‌కు అనుగుణంగా మలుచుకోవ‌డంలో ఆయ‌న దిట్ట అని చెప్తుంటారు. అయితే అలాంటి కేసీఆర్ త‌న‌ను టార్గెట్ చేసిన శ‌క్తుల‌కు అనూహ్య రీతిలో అస్త్రం ఇచ్చారా? ఓట్ల రాజ‌కీయాల్లో భాగంగా వేసిన లెక్క‌లు త‌ప్పి ఆయ‌న ఇర‌కాటంలో ప‌డుతున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఇదంతా ప‌రిపూర్ణానంద స్వామి అరెస్టు, రాష్ట్రం నుంచి త‌ర‌లింపు నేప‌థ్యంలో తెర‌మీద‌కు వ‌చ్చిన చ‌ర్చ‌.

శాంతిభ‌ద్ర‌త‌ల కోణాన్ని పేర్కొంటూ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై న‌గ‌ర‌ బ‌హిష్క‌ర‌ణ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై హిందుత్వ అనుకూల శ‌క్తులు భ‌గ్గుమంటున్నాయి. కేసీఆర్ తీరును నిర‌సిస్తూ గురువారం హైద‌రాబాద్ న‌గ‌రంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. బీజేపీ, భజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ శ్రేణులు ధర్నా చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. న‌గ‌రంలోని వారు ఈ సంఘ‌ట‌న పూర్వాప‌రాల‌గురించి చ‌ర్చించుకోవ‌డం మొద‌లైంది. అంత‌కుముందురోజు స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది. స్వామి పరిపూర్ణానందను వెంటనే నగర బహిష్కరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఛలో ప్రగతిభవన్ కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ర్యాలీగా వెళ్లి సీఎం కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మ‌రోవైపు ఈ ఎపిసోడ్‌లోకి బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ, ప్ర‌ముఖ హిందుత్వ నాయ‌కుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఎంట్రీ ఇచ్చారు. ప‌రిపూర్ణ బ‌హిష్క‌ర‌ణ రాజ్యాంగ విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. `తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హాజర్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980. U/S 3 ప్రకారం స్వామి పరిపూర్ణానంద వారిని బహిష్కరణకు గురిచేస్తూ మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. మీ ప్రభుత్వాధికారులు సెక్షన్ 3 ని అనుసరించి స్వామీజీని బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాకు తెలిసినంత వరకు ఈ బహిష్కరణ వేటును కేవలం గుండాలకు, రౌడీలు, సంఘవిద్రోహశక్తులకు మాత్రమే విధిస్తారు. దీన్ని వెంట‌నే ఉప‌సంహరించుకోండి` అనే సారాంశంతో లేఖ రాశారు. దీంతో మ‌రోమారు ఈ విష‌యం జాతీయ స్థాయిలో ఫోక‌స్ అయింది.

ఇలా ఇటు రాష్ట్రంలో, అటు జాతీయ స్థాయిలో కేసీఆర్ త‌నంత తానుగా బీజేపీ స్పందించేలా ఓ చాన్స్ ఇచ్చాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌రిపూర్ణ‌పై బ‌హ‌ష్కర‌ణ‌తో కేసీఆర్ అన‌వ‌స‌రంగా కెలుక్కున్నాడనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇన్నాళ్లు ఏ రూపంలో రోడ్డెక్కాలా అని చూస్తున్న బీజేపీకి త‌నంత‌తానుగా మంచి అవ‌కాశం ఇచ్చాడని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని.. దీనికి పరిపూర్ణనంద స్వామి నగర బహిష్కరణే నిదర్శనమని బీజేపీ విజ‌య‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌గ‌లిగింది. మెజార్టీగా ఉన్న హిందువుల‌కు మద్దతుగా కమలనాథులు కదం తొక్కారు. దీంతో కేసీఆర్ ఓటు బ్యాంకులో చీలిక ఖాయ‌మైంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ముస్లింలు, ఎస్సీల ఓట్లు కాపాడుకునేందుకు కేసీఆర్ ప‌లు ర‌కాల ఎత్తులు వేస్తున్న స‌మ‌యంలో...ఈ చీలిక ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్తున్నారు.