Begin typing your search above and press return to search.

పార్టీనేత‌ల‌కు భ‌రోసా ఇస్తూనే..భ‌య‌పెట్టిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   27 Aug 2017 12:30 AM GMT
పార్టీనేత‌ల‌కు భ‌రోసా ఇస్తూనే..భ‌య‌పెట్టిన కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోదైన త‌న‌దైన శైలిలో పార్టీ నేత‌లతో స‌మావేశం అయ్యారు. పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్‌ లో ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటుచేసిన గులాబీ ద‌ళ‌ప‌తి ఈ క్ర‌మంలో పార్టీ నాయ‌కుల‌కు భ‌రోసా ఇస్తూనే ఒకింత‌ భ‌యం క‌ల్పించారు. టీఆర్‌ ఎస్‌ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు రాబోయే ఎన్నికల్లో 100 నుంచి 105 సీట్లు వస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజల్లో మనకే విశ్వాసం ఉందని ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఆదేశించారు.

సర్వేలు అన్నీ టీఆర్ ఎస్‌ అనుకూలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. 2019లో అధికారం మనదేన‌ని..విపక్షాలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. సిట్టింగ్‌ లు అందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటానని ప్ర‌క‌టించారు. భూ సమగ్ర సర్వే - రైతు కమిటీలు - సంక్షేమ పథకాలపై సమావేశంలో చర్చ జరిగిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.భూ సర్వేలో ప్రతి మూడు గ్రామాలకు ఒక అధికారుల బృందం ఉంటుంది. ఒక్కో ప్రజాప్రతినిది తలా మూడు గ్రామాలు యూనిట్‌గా పనిచేయాలి. భూ సర్వే పూర్తయ్యే వరకూ ఒక్కరు కూడా హైదరాబాద్ రావద్దని సీఎం సూచించారు. రైతుల మనసుల్లో మనం చిరస్థాయిగా నిలిచిపోవాలన్నారు.