Begin typing your search above and press return to search.

కేటీఆర్ ను మిస్ చేస్తే ఎలా కేసీఆర్‌

By:  Tupaki Desk   |   30 May 2017 4:35 AM GMT
కేటీఆర్ ను మిస్ చేస్తే ఎలా కేసీఆర్‌
X
త‌న మాట‌ల‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంత‌గా మేజిక్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌తో రాజుకున్న రాజ‌కీయ వేడి.. అంత‌కంత‌కూ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అధికార‌ప‌క్షం.. విప‌క్షాలు ఎవ‌రికి వారు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతూ.. మాట‌ల యుద్ధాన్ని జోరుగా సాగిస్తున్నారు.

తాజాగా అదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ.. కాంగ్రెస్ నేత‌లు పార్టీలో చేరిన సంద‌ర్భంగా కార్య‌క‌ర్తలు.. నేత‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన కేసీఆర్.. ప్ర‌తిప‌క్షాల‌పై ఎంత‌గా మండిప‌డ్డారో తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాగా ప‌ని చేసే నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు క‌డుపులో పెట్టుకొని చూసుకుంటార‌ని.. అందుకు తాను.. సిద్ధిపేట‌లో హ‌రీశ్ రావులు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నాలుగా అభివ‌ర్ణించారు.

ఇటీవ‌ల కేసీఆర్ వెల్ల‌డించిన స‌ర్వేలో అత్యుత్త‌మ ప‌ని తీరు సాధించిన ఎమ్మెల్యేల జాబితాలో కేటీఆర్ రెండో స్థానంలో నిలిచారు. హ‌రీశ్ మూడో స్థానంలో నిలిచారు. బాగా ప‌ని చేసే ఎమ్మెల్యేల పేరిట త‌న పేరును.. హ‌రీశ్ రావు పేరును ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. సెకండ్ ప్లేస్‌లో నిలిచిన త‌న కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ పేరును ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం ఏమిటో? బాగా ప‌ని చేసిన వారిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తారంటూ పోలిక‌లు.. ఉదాహ‌ర‌ణ‌లు చెప్పిన వేళ‌.. కొడుకు పేరును ప్ర‌స్తావించ‌ని వైనాన్ని చూస్తే.. కేసీఆర్ ఎంత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్పాలి. స‌ర్వేల్లో పేరు ప్ర‌ఖ్యాతులున్న‌ట్లు చెప్పే కొడుకు ఉదంతాన్ని క‌నీసం ప్ర‌స్తావించ‌కుండా.. ఆ త‌ర్వాతి స్థానంలో నిలిచిన హ‌రీశ్ పేరును త‌న పేరు త‌ర్వాత ప్ర‌స్తావించ‌టాన్ని చూసిన‌ప్పుడు కేసీఆర్ తెలివితేట‌లు ఎంత‌లా ఉంటాయ‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/