Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫెడ‌ర‌ల్ మాట మటాషేనా?

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:57 AM GMT
కేసీఆర్ ఫెడ‌ర‌ల్ మాట మటాషేనా?
X
త‌న‌కు త‌గ్గ‌ట్లుగా త‌న మాట‌ల్ని మార్చుకోవ‌టంలో దిట్ట తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్న విమ‌ర్శ ఉంది. అన్ని రోజులు ఒకేలా ఉండ‌వ‌న్న విష‌యం కేసీఆర్‌ కు త్వ‌ర‌లోనే తెలిసే రోజు వ‌స్తుంద‌న్న మాట ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. తాను చెప్పిన మాట‌ను.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మార్పులు చేర్పులు చేసే నేర్పు ఉన్న ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట‌ను మ‌హా జోరుగా ప్ర‌స్తావించ‌టం తెలిసిందే.

ఏదో మాట వ‌ర‌స‌కు చెప్పిన‌ట్లు కాక‌కుండా స్పెష‌ల్ చాప‌ర్ తీసుకొని మ‌రీ.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌ను.. క‌ర్ణాట‌క జేడీఎస్ అధినేత దేవెగౌడ‌తో స‌హా మ‌రికొన్ని రాష్ట్రాల‌కు ప్ర‌యాణం కావ‌టం తెలిసిందే. అయితే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఈ ప్ర‌యాణాలు సాగినా.. ఈ జ‌ర్నీల్లో ఆయ‌న దేవాల‌యాల్ని సంద‌ర్శించ‌టం.. త‌న అధికారిక ట్రిప్పు దేవాల‌యాల్ని సంద‌ర్శించ‌ట‌మేన‌న్న వాస్త‌వం బ‌య‌ట‌కు వ‌చ్చి.. ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్‌కు మామూలే అని న‌మ్మే వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను మాటాష్ అయ్యేలా చేసింద‌న్న మాట వినిపిస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట ప్ర‌ధాని మోడీకి ల‌బ్ధిని చేకూర్చేందుకే అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీని బ‌ల‌ప‌ర్చేలా కొన్ని ఉదంతాల్ని ఇప్ప‌టికే చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీతో భేటీ కావ‌టం.. నీతి ఆయోగ్ స‌మావేశానికి వెళ్ల‌టం మిన‌హా.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ చేస్తున్న నిర‌స‌న విష‌యంపై పెద్ద‌గా స్పందించ‌లేదు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ‌స్థాయిలో కొత్త చ‌రిత్ర సృష్టిస్తానంటూ బ‌డాయి మాట‌లు చెప్పిన కేసీఆర్‌.. తాజాగా కేంద్రంపై పోరు స‌లుపుతున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ చేస్తున్న నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిన ఉన్న‌ప్ప‌టికీ.. మాట వ‌ర‌స‌కు సైతం ఆ ప్ర‌స్తావ‌న తీసుకురాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం గ‌మ‌నార్హం.

రాష్ట్రాల హ‌క్కుల కోసం.. కేంద్రం తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ.. విధానాలు మార్చాల‌న్న డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట‌.. కీల‌క వేళ‌లో చ‌ప్పుడు చేయ‌కుండా ఉండ‌టం చూసిన‌ప్పుడు కేసీఆర్ తీరుతో ఫెడ‌ర‌ల్ కు స‌మాధాని క‌ట్టేసిన‌ట్లేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తుగా.. ఆయ‌న చేస్తున్న దీక్ష‌కు ద‌న్నుగా నిలిచేందుకు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామి.. కేర‌ళ సీఎం విజ‌య‌న్ లు పాద‌యాత్ర చేస్తూ హాట్ టాపిక్ గా మారినా.. కేసీఆర్ మాత్రం కామ్ గా ఉండ‌టం చూసిన‌ప్పుడు ఆయ‌న ఊపిరి పోసిన‌ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గొంతును ఆయ‌నే నులిమిన‌ట్లుగా కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.