Begin typing your search above and press return to search.

ద‌టీజ్ కేసీఆర్‌..అమిత్ షా అయినా డోంట్ కేర్‌!

By:  Tupaki Desk   |   26 Aug 2019 4:16 AM GMT
ద‌టీజ్ కేసీఆర్‌..అమిత్ షా అయినా డోంట్ కేర్‌!
X
ఒక‌ప్ప‌టికీ... ఇప్ప‌టికీ...తెలంగాణ‌లో అధికార ప‌క్ష‌మైన టీఆర్ ఎస్‌ కు - ఢిల్లీలో గ‌ద్దెనెక్కిన‌ బీజేపీకి మ‌ధ్య సంబంధాల్లో స్ప‌ష్ట‌మైన తేడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒకప్పుడు బీజేపీ నేత‌లు ముఖ్య ప‌ద‌విని అలంక‌రిస్తే వారికి ఘ‌న స‌న్మానం చేసిన ఘ‌న‌త కేసీఆర్‌ ది. ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య‌నాయుడు - మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ గా విద్యాసాగ‌ర్‌ రావు ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యంలో...కేసీఆర్ ఇలా త‌న ముద్ర వేసుకున్నారు. అయితే, ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ అంటేనే కేసీఆర్ చీద‌రించుకుంటున్నారు. దానికి నిద‌ర్శ‌నం తాజా ఘ‌ట‌న‌. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి - డీజీపీ మహేందర్‌ రెడ్డి హాజరుకానున్నారు.

కేంద్ర‌హోంశాఖ మంత్రి - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా అధ్య‌క్ష‌తన జ‌రిగే ఈ స‌మావేశానికి ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరవుతున్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజ‌రు అవుతున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొన్న తర్వాత ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని పలువురు ప్రముఖులను కలుసుకొనే అవకాశముంది. మంగళవారం మధ్యాహ్నానికి ఆయన తిరిగి విజయవాడ చేరుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ కీల‌క సమావేశంలో ఆంధ్ర - ఒడిశా - ఛత్తీస్‌ గఢ్ సరిహద్దులతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావంపై చర్చ జరుగనుందని సమాచారం.

కాగా, ఈ స‌మావేశాన్ని అమిత్‌ షా ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుండ‌ట‌మే తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజ‌రు కార‌ణంగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేసేందుకు అమిత్‌ షా పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ పెద్ద ఎత్తున కేసీఆర్ స‌ర్కారును తూర్పార‌ప‌ట్టారు. మ‌రోవైపు పెద్ద ఎత్తున నేత‌ల‌ను చేర్చుకుంటూ బీజేపీని బ‌లోపేతం చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అమిత్‌ షా సార‌థ్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి కేసీఆర్ గైర్హాజ‌ర‌య్యార‌ని అంటున్నారు. గ‌తంలోనూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సార‌థ్యంలో జ‌రిగిన సమావేశానికి కూడా కేసీఆర్ గైర్హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే.